Viral Video: ర్యాంప్‌పై చాలా స్టైల్‌గా నడిచిన టీచర్.. విద్యార్థుల రియాక్షన్ చూడాల్సిందే.. మైండ్ బ్లాక్..
బ్లాక్ డ్రెస్‌లో ఈ టీచర్ నడకను చూసి వావ్ అనకుండా ఉండలేకపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ర్యాంప్‌పై చాలా స్టైల్‌గా వాక్ చేసింది ఓ టీచర్. ఆమె నడకను చూసిన విద్యార్థులు వావ్ అంటూ కేకలు వేయకుండా ఉండలేకపోయారు. ఆ టీచర్ స్టైల్ చూసి ఓ విద్యార్థి వేదికపైనే పడిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ముంబైలోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్‌ఎంఐఎస్)లో తాజాగా ఓ ఈవెంట్ జరిగింది. ఇందులో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే వేదికపై విద్యార్థులు ర్యాంప్ వాక్ చేశారు. అనంతరం వాళ్ల టీచర్ కూడా ర్యాంప్ వాక్ చేసింది.
ఆమె నడిచిన తీరుకు విశేష స్పందన వచ్చింది. ఈ వీడియోను కావ్య చౌదరి అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బ్లాక్ డ్రెస్‌లో ఈ టీచర్ నడకను చూసి వావ్ అనకుండా ఉండలేకపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ టీచర్ తమ హృదయాన్ని గెలుచుకుందని కొందరు కామెంట్ చేశారు. టీచర్లు ఇలాంటి పనులు చేయడం ఏంటంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
View this post on Instagram
హవాలా మార్గంలో భారత్ నుంచి చైనాకు రూ.50 వేల కోట్లు.. ఏం జరిగిందో తెలుసా?