చెట్టెక్కి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు
సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థులకు పాఠాలు బెబుతారు. కానీ ఓ ఉపాధ్యాయుడు చెట్టుపై నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు.

సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థులకు పాఠాలు బెబుతారు. కానీ ఓ ఉపాధ్యాయుడు చెట్టుపై నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు.
సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థులకు పాఠాలు బెబుతారు. కానీ ఓ ఉపాధ్యాయుడు చెట్టుపై నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. వేప చెట్టెక్కి విద్యార్థులకు నాగరికత, రాజ్యాలు, రాజులు వారి యుద్ధాలపై ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నాడు. విద్యార్థుల కోసం రోజూ చెట్టుపైకి ఎక్కి పాఠాలు చెబుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే…పశ్చిమ బెంగాల్ లోని బాంకురా జిల్లా అహందా గ్రామానికి చెందిన సుబ్రతాపాటి (35) కోల్ కత్తాలోని రెండు విద్యాసంస్థల్లో హిస్టరీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా తన స్వగ్రామానికి వెళ్ళారు. అక్కడ నెట్ వర్క్ తక్కువగా ఉండటంతో అతడి సెల్ పోన్ కు సిగ్నల్ అంతంత మాత్రమే అందడంతో ఇంటర్ నెట్ పని చేయలేదు. కానీ అతడు ఆన్ లైన్ లో విద్యార్థులకు పాఠాలు బోధించడం అనివార్యమైంది.
ఈ నేపథ్యంలో అతనికి ఒక ఆలోచన తట్టింది. తన ఇంటి సమీపంలోని వేప చెట్టుపైకెక్కి సిగ్నల్ కోసం ప్రయత్నించారు. సెల్ ఫోన్ కు సిగ్నల్ అందింది. దీంతో ఆ చెట్టుపైనే కర్రలతో చిన్నపాటి నివాసం ఏర్పరచుకున్నాడు. చెట్టుపై నుంచే విద్యార్థులకు పాఠాలు బోధించడం ప్రారంభించారు.
ఉదయాన్నే భోజనం, నీళ్లు తీసుకుని చెట్టుపైకి ఎక్కుతానని ఉపాధ్యాయుడు సుబ్రతాపాటి చెప్పారు. చెట్టుపై ఎలాంటి అంతరాయం లేకుండా సిగ్నల్ వస్తోందని తెలిపారు. ఆన్ లైన్ లో ప్రతిరోజూ 2 నుంచి 3 తరగుతులు బోధిస్తానని తెలిపారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నా తట్టుకుంటున్నానని చెప్పారు. తన వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, అందుకే ఎంత ఇబ్బంది అయినా పాఠాలు బోధిస్తున్నానని చెప్పారు.