పుల్వామా దాడి..పాక్ పై సిద్ధూ సానుభూతి

పాకిస్తాన్ పై మరోసారి పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ సానుభూతి ప్రకటించారు. పుల్వామా జిల్లాలో గురువారం జైషే మహమద్ జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సిద్ధూ..అదో పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగినా వ్యతిరేకించాలని, దానికి భాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, అదే సమయంలో కొంతమంది చేసిన తప్పుకు దేశం మొత్తాన్ని నిందిస్తున్నారని మరోసారి పాక్ పై తన ప్రేమను చాటుకొన్నారు.
ఉగ్రవాదానికి ఏ దేశం, ఏ మతం లేదన్నారు.సిద్ధూ కామెంట్స్ పై పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు.గతంలో కూడా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్ ని కౌగలించుకొని విమర్శల పాలైన విషయం తెలిసిందే.
అంతకుముందు ఉగ్రదాడిని ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. పాక్ డబుల్ గేమ్స్ ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని, పాక్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. పుల్వామా దాడికి భారత ప్రభుత్వం ధీటుగా బదులివ్వాలని అన్నారు.