కీలక ఉగ్రవాది అరెస్టు

కీలక ఉగ్రవాది అరెస్టు

Updated On : February 14, 2021 / 8:08 AM IST

Terrorist arrested : జమ్మూలో కీలక ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’కు చెందిన కీలక ఉగ్రవాది జహూర్‌ అహ్మద్‌ రాఠేర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్మూలోని సాంబా జిల్లాలో జహూర్‌ ఉన్నాడన్న సమాచారంతో దాడి చేసి అతన్ని పట్టుకొన్నారు.

పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు పంపిన ఆయుధాలను తీసుకోవడానికి అతను సాంబాకు వెళ్లాడు. మరోవైపు పంజాబ్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్‌ చెందిన చొరబాటుదారుడిని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు శనివారం హతమార్చారు.