Congress Key Decision : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం..ఒంటరిగా పోటీ చేస్తామని ప్రియాంక గాంధీ ప్రకటన

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని..ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రకటించారు.

Congress Key Decision : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం..ఒంటరిగా పోటీ చేస్తామని ప్రియాంక గాంధీ ప్రకటన

Congress

Updated On : November 14, 2021 / 6:17 PM IST

Uttar Pradesh Assembly elections : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక ప్రకటన చేశారు. ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఎస్పీ లేదా బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరిగినప్పటికీ..వాటిని కొట్టిపారేస్తూ ప్రియాంక గాంధీ క్లారిటీ ఇచ్చారు. బులంద్‌షహర్‌లో ప్రతిగ్య సమ్మేళన్ లక్ష్య-2021 పదాదికారుల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని పలువురు పార్టీ కార్యకర్తలు తనను కోరినట్లు తెలిపారు.

SSRC Meeting : దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభం..ఏపీ ప్రస్తావించనున్న అంశాలు

తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, ఒంటరిగానే పోటీ చేస్తామని కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నట్లు ప్రియాంక చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తేనే మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందన్నారు. పొత్తులో భాగంగా చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఏ పార్టీతోనైతే పొత్తు పెట్టుకుంటున్నామో ఆ పార్టీ వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు తోడై తక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందన్న కోణంలోనే ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదన్న ప్రియాంక ప్రకటనతో యూపీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.