Unforgettable rejection : జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ చేసి అమెజాన్ గిఫ్ట్ కార్డు పంపారు.. దయ గల ఆ కంపెనీ ఏదంటే?
రెజ్యూమ్ నచ్చకపోతే ఏ కంపెనీ అయినా అప్లికేషన్ రిజెక్ట్ చేయడం కామనే. కానీ ఓ కంపెనీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కూడా ఇచ్చింది. జాబ్ రాలేదనే నిరాశను పోగొడుతూ ఆ కంపెనీ చేస్తున్న పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

Unforgettable rejection
Unforgettable rejection : ప్రొఫైల్ నచ్చకపోతే ఏ కంపెనీ అయినా జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంది. అయితే ఓ కంపెనీ రిజెక్షన్ లెటర్‌తో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపింది అప్లికెంట్‌కి.. ఆ దయగల కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చదవండి.
Swiggy, Zomato, Amazon : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో సర్వీసులు బంద్ ..
సిలికాన్ వ్యాలీ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ‘సీక్రెట్ సుషీ’ తమ వద్దకు వచ్చిన జాబ్ అప్లికేషన్లను ఎంతో దయతో రిజెక్ట్ చేస్తోంది. అలా చేసి అందరి ప్రశంసలు పొందుతోంది. ఇటీవల ఓ దరఖాస్తుదారుకి రిజెక్షన్ లెటర్‌తో పాటు $7 (ఇండియన్ కరెన్సీలో 582.53) విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపింది. ఈ మ్యాటర్ రెడ్డిట్‌లో వైరల్ అయింది.
ఉద్యోగానికి పంపిన మన అప్లికేషన్ రిజెక్ట్ అయితే నిజానికి బాధపడతాం. ఆ బాధని మర్చిపోయేలా చేస్తూ దయతో ఆ కంపెనీ చేస్తున్న పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్‌గా ‘malevitch_square’ అని పిలువబడే Reddit వినియోగదారు ‘రిక్రూటింగ్‌హెల్’ సబ్‌రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకోవడంతో ఈ స్టోరీ వైరల్ అయ్యింది. ఆమె $7 అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌తో పాటు మేనేజర్ రోల్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత సీక్రెట్ సుషీ నుండి అందుకున్న రిజెక్షన్ ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. తన రెడ్డిట్ పోస్ట్‌లో ఆమె దానిని “అత్యుత్తమ తిరస్కరణ” అని పోస్ట్ చేసింది.
ఏది ఏమైనా జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ బహుమతిగా ఇవ్వడం Reddit వినియోగదారుల్ని ఆకర్షించింది. జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అయినందుకు నిరాశ పడకుండా వారిపై సానుకూలత చూపించే విధంగా ఆ కంపెనీ చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు.
Guys, this is truly a first. I got sent an Amazon gift card as part of my rejection.
by u/malevitch_square in recruitinghell