Free Legal Aid : ఉచిత న్యాయ సాయం కావాలంటే ఇలా దరఖాస్తు చేసుకోండి

పలు అంశాల్లో బాధితులైన వారికి ఉచిత న్యాయ సేవలు అందిస్తారని చాలామందికి తెలియకపోవచ్చు. ఉచిత న్యాయ సేవలకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఈ అంశాలు చదవండి.

Free Legal Aid : ఉచిత న్యాయ సాయం కావాలంటే ఇలా దరఖాస్తు చేసుకోండి

Free Legal Aid

Updated On : September 13, 2023 / 6:34 PM IST

Free Legal Aid :  తాము బాధితులుగా ఉన్నప్పుడు, లాయర్లకు ఫీజులు చెల్లించే స్థోమత లేనప్పుడు ఉచితంగా న్యాయ సేవలు పొందే అవకాశం ఉందని చాలామందికి తెలియదు. అలాంటి వారి కోసం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) చట్టం పరిధిలోని సెక్షన్ 12 ఉచిత న్యాయ సేవలు కల్పించాలని ఆదేశిస్తోంది. అసలు ఈ సేవలు పొందడానికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? చదవండి.

Rajasthan: కాలు విరిగిన కొడుకుని స్కూటర్ మీద లిఫ్ట్‌లో తీసుకెళ్లిన లాయర్.. ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర సంఘటన

ఉచిత న్యాయ సేవలు పొందాలంటే దానికి అర్హతలు ఉన్నాయి. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు, మానవ అక్రమ రవాణా బాధితులు, మానసికంగా ఆరోగ్యంగా లేనివారు, దివ్యాంగులు, జాతి వైషమ్యాలతో హింసకు గురైన వారు, కులం పేరుతో వేధింపులకు గురైన వారితో పాటు తుపాన్లు, కరువు, భూకంపం వంటి విపత్తులలో బాధితులైన వారికి కూడా ఉచిత న్యాయ సేవలు అందుతాయి.

ఉచిత న్యాయ సాయాన్ని పొందాలంటే ఆదాయ పరిమితులు కూడా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే రూ.3 లక్షలు, తెలంగాణలో అయితే రూ.లక్ష ఆదాయానికి పరిమితి ఉంది. మహిళలు, చిన్నారులకు ఈ ఆదాయ పరిమితితో ఎటువంటి సంబంధం ఉండదు. సీనియర్ సిటిజన్లకు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలకు అనుగుణంగా ఉచిత న్యాయ సేవలు పొందే అవకాశం ఉంది.

Ponnavolu Sudhakar Reddy : జగన్ ప్రభుత్వానిది చాలా పెద్ద హృదయం, చంద్రబాబుకి ఎంతో సాయం చేసింది- సీఐడీ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి

ఉచిత న్యాయ సాయం క్రింద బాధితుల తరపున వాదనలు వినిపించేందుకు లాయర్‌ను ఏర్పాటు చేస్తారు. లీగల్ ప్రొసీడింగ్స్‌కు అయ్యే ఖర్చులు, ప్రాసెస్ ఫీజు. ప్లీడింగ్స్ తయారు చేయడం, అప్పీలు మెమోలు తయారు చేయడం, డాక్యుమెంటేషన్, లీగల్ డాక్యుమెంట్స్ డ్రాఫ్ట్ చేయడం, తీర్పులు, ఉత్తర్వులు, నోట్స్ ఆఫ్ ఎవిడెన్స్, లీగల్ ప్రోసీడింగ్స్‌కు అవసరమైన ఇతర డాక్యుమెంట్ల సర్టిఫైడ్ కాపీలను అందించడం, న్యాయ సలహాలు, అప్పీళ్లు ఇవన్నీ ఉచిత న్యాయ సేవలో భాగంగా బాధితులకు అవసరమైనవి ఉచితంగా అందిస్తారు.

ఉచిత న్యాయ సేవకోసం అప్లికేషన్లను ఆన్‌‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా వెళ్లాలంటే తాలుకా స్ధాయి నుంచి సుప్రీం కోర్టు వరకు ఆయా కోర్టుల ఆవరణలో ఉండే లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో అప్లికేషన్లు సమర్పించాలి. తెల్లని కాగితంపై మీ వివరాలను రాసి, అర్హతలకు సంబంధించిన డాక్యుమెంట్లు జత చేసి పోస్ట్‌లో కూడా పంపవచ్చును. నల్సా ఈమెయిల్ (nalsa-dla@nic.in) ద్వారా కూడా పంపవచ్చును. ఆన్‌‌లైన్ ఉచిత న్యాయసేవల కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా వెబ్ సైట్‌కి లాగిన్ అవ్వాలి. ఇందులో న్యూ అప్లికేషన్ బటన్‌ను క్లిక్ చేసి అప్లికేషన్‌ను ఫిల్ చేయాలి. ఏ విభాగానికి సంబంధించిన సేవలు కావాలో వివరంగా ఉంటుంది. వీటిని పూర్తి చేయడంతో పాటు వ్యక్తిగత, కుటుంబ వివరాలను కూడా నమోదు చేసి ఫోటో అప్‌లోడ్ చేయాలి.

Chandrababu Arrest : ఏసీబీ కోర్టులో 28పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. సంచలన విషయాలు వెల్లడి.. అందులో ఏముందంటే?

ఏ విషయంలో న్యాయసేవలు కోరుకుంటున్నారో అభ్యర్థిస్తూ ఆ కేసు తాలూకు పూర్వాపరాలు వివరంగా నమోదు చేయాలి. అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నంబర్ సాయంతో మీ అప్లికేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చును. మీ దరఖాస్తును సంబంధిత కమిటీ పరిశీలించి మీకు అవసరమైన న్యాయ సాయం 7 రోజుల్లో అందిస్తుంది.