Assam : ఆ గ్రామంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఆ వింత గ్రామం ఎక్కడంటే?

రాత్రి వేళ ఆ గ్రామంలోకి వెళ్లడం నిషేధం. 7 దాటితే అక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుని చనిపోతాయి. 9 నెలలుగా ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. ఆ మిస్టీరియస్ విలేజ్ ఎక్కడో తెలుసుకోవాలని ఉందా?

Assam : ఆ గ్రామంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఆ వింత గ్రామం ఎక్కడంటే?

Assam

Assam : ఆ గ్రామంలో ఆగస్టు, నవంబర్ వచ్చిందంటే అనేక జాతుల పక్షులు చనిపోతుంటాయి. అవి బలవన్మరణానికి పాల్పడుతున్నాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. దీని వెనుక కారణం ఏంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇంతకీ ఎక్కడ అంటే?

Stone River : ‘రాళ్ల నది’.. గ్లాసుడు నీళ్లు కూడా కనిపించని వింత నది..
అస్సాంలోని జాతింగా విలేజ్ రాత్రి అయితే ఈ గ్రామంలోకి ప్రవేశం నిషేధం. ఇతర గ్రామాలతో 9 నెలలుగా ఈ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయట. ఎందుకంటే ఈ గ్రామంలో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో పక్షులు ఆత్మహత్యకు పాల్పడుతుంటాయి. ఇళ్లను, చెట్లను ఢీకొట్టుకుని చనిపోతున్నాయి. ఆశ్చర్యపోతున్నారా? నిజమే. ఈ గ్రామంలో ఆగస్టు, నవంబర్ నెల వచ్చిందంటే పక్షులు బలవన్మరణానికి పాల్పడతాయి. అందుకు కారణాలు ఏంటనేది తెలియట్లేదు.

ఈ గ్రామానికి అనేక జాతుల పక్షులు వస్తుంటాయి. ఒక్కోసారి విదేశీ పక్షలు కూడా వస్తుంటాయి. అవి కూడా ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడుతున్నాయి. ఇక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు ప్రజలకు అర్ధం కావట్లేదు.అయితే ఇక్కడ అయస్కాంత శక్తి ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తోడు పొగమంచు ఎక్కువగా ఉండటం.. వేగంగా గాలులు వీయడం కూడా కారణం కావచ్చని వారు చెబుతున్నారు. చీకటి సమయంలో పరిసరాలు సరిగా కనిపించక ఢీ కొట్టుకుని చనిపోతూ ఉండవచ్చని వారి అభిప్రాయం.

Guinness World Record : 160 కి.మీ నిద్రలో నడిచిన బాలుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన వింత స్టోరి

గ్రామస్తులు మాత్రం రకరకాల కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ గ్రామంలో ఏదో దుష్టశక్తి ఉందని.. అది పక్షులను బతకనివ్వట్లేదని నమ్ముతున్నారు. దాని నుంచి తమను రక్షించుకోవడం కోసం వారు ఇళ్ల ముందు వెదురు కర్రలు పాతిపెట్టారు.  వాతావరణ పరిస్థితులవల్లే అవి చనిపోతున్నాయా? లేక అసలు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ‘సూసైడ్ పాయింట్ ఆఫ్ బర్డ్స్’ గా మాత్రం ఈ గ్రామం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.