India Covid-19 New Cases : ఈ 7 రాష్ట్రాల్లో ఒకేరోజులో 87.73 శాతం కరోనా కొత్త కేసులు..

భారతదేశంలో కరోనా మళ్లీ కోరలు చాసింది.. మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే రోజువారీ కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి.

India Covid-19 New Cases : ఈ 7 రాష్ట్రాల్లో ఒకేరోజులో 87.73 శాతం కరోనా కొత్త కేసులు..

Single Day Of Covid 19 New Cases In 7 States (1)

Updated On : March 14, 2021 / 5:04 PM IST

Single Day of Covid-19 New Cases in 7 states : భారతదేశంలో కరోనా మళ్లీ కోరలు చాసింది.. మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ పెద్ద సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే రోజువారీ కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. ఒకరోజులో 15,602 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కేరళలో 2,035 కేసులు, పంజాబ్ లో 1,510 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకేరోజులో కొత్త కరోనా కేసులు 87.73శాతం నమోదయినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ లో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2.10 లక్షలకు చేరింది. మహరాష్ట్ర, కేరళ, పంజాబ్ రాష్ట్రాలతో కలిపి 76.93శాతం కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 16,637 మందితో కలిపి.. దేశంలో మొత్తంగా కరోనా రికవరీల సంఖ్య 1,09,89,897కు చేరింది.

ఆరు రాష్ట్రాల్లో కొత్త కరోనా రికవరీ కేసుల సంఖ్య 83.13శాతానికి చేరింది. మహారాష్ట్రలో సింగిల్ డేలో గరిష్టంగా 7,467 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఒకే రోజులో 161 మరణాలు నమోదైనట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే కొత్త కరోనా మరణాల్లో ఆరు రాష్ట్రాలు 84.47శాతం నమోదయ్యాయి. మహారాష్ట్రలో గరిష్టంగా 88 మరణించగా.. పంజాబ్ లో 22 మంది, కేరళలో 12మంది మరణించారు.

దేశంలోని మిగతా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక కరోనా మరణం కూడా నమోదు కాలేదు. మరోవైపు భారతదేశం వ్యాప్తంగా 5,10,400 సెషన్లలో ఆదివారం ఉదయం 7 గంటల వరకు దాదాపు (2,97,38,409) మూడు కోట్ల వ్యాక్సినేషన్ డోస్‌లను అందించారు.