Perfect 80 Point Turn : కొండ అంచున యూ టర్నింగ్.. వీడియో వైరల్

బ్లూ కలర్ తో ఉన్న కారును అత్యంత ఇరుకుగా ఉన్న దారిలో యూ టర్న్ చేశాడు. కారు వెనుకకు..ముందుకు..ఇలా చేస్తూ..సక్సెస్ ఫుల్ గా టర్నింగ్ చేశాడు. వెనుకకు తీసేటప్పుడు కారు చక్రాలు...

Perfect 80 Point Turn : కొండ అంచున యూ టర్నింగ్.. వీడియో వైరల్

Perfect 80 Point Turn

Updated On : January 24, 2022 / 9:07 PM IST

Perfect 80 Point Turn : కొంతమంది డ్రైవర్లు చేసే ఫీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాళ్లు చేసే స్కిట్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ఒళ్లు గొగురుపాటుకు గురయ్యే విధంగా ఉంటాయి. తాజాగా..ఓ వీడియో అందర్నీ భయపెడుతోంది. కొండ అంచున ఓ కారును యూ టర్న్ తీశాడో ఓ డ్రైవర్. ఆ వీడియో చూస్తుంటే క్షణం..క్షణం ఏమవుతుందో అనే టెన్షన్ ఉంటుంది. అసలు విషయానికి వస్తే…కొండల వద్ద ఓ ఘాట్ రోడ్డు ఉంది. కొండల అంచను యూ టర్న్ తీసుకోవడం అసలు సాధ్యం కాదు.

Read More : UP Assembly Election: యూపీ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా ఇదే..

కానీ..ఈ వీడియో బ్లూ కలర్ తో ఉన్న కారును అత్యంత ఇరుకుగా ఉన్న దారిలో యూ టర్న్ చేశాడు. కారు వెనుకకు..ముందుకు..ఇలా చేస్తూ..సక్సెస్ ఫుల్ గా టర్నింగ్ చేశాడు. వెనుకకు తీసేటప్పుడు కారు చక్రాలు కొండ చివరన ఉండడంతో పడిపోతుందా అనిపించింది. కానీ..అమాంతం డ్రైవర్ ముందుకు టర్నింగ్ చేయడం జరిగిపోయింది. ఇలా 80 నిమిషాల పాటు ట్రై చేసి ముందుకు వెళ్లిపోయాడు. దీనిని చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్ నైపుణ్యాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. గత డిసెంబర్ లో షేర్ చేసిన ఈ వీడియో మళ్లీ ఇప్పుడు వైరల్ గా మారింది.