PM Modi :ప్రధాని మోడీని చంపుతామని బెదిరింపు..హత్యకు 20కిలోల ఆర్డీఎక్స్..20మందితో స్లీపర్‌సెల్‌ రెడీగా ఉందని వార్నింగ్

ప్రధాని మోదిని హతమారుస్తామంటూ ముంబై లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. నిఘా వర్గాలకు అగంతకుడు E-మెయిల్ పంపించాడు. మోడీని చంపటానికి అన్ని సిద్ధంగా ఉన్నాయంటూ..

PM Modi :ప్రధాని మోడీని చంపుతామని బెదిరింపు..హత్యకు 20కిలోల ఆర్డీఎక్స్..20మందితో స్లీపర్‌సెల్‌ రెడీగా ఉందని వార్నింగ్

Threatening E Mail Sent Ssassinate Pm Modi

Updated On : April 1, 2022 / 3:30 PM IST

threatening e-mail sent ssassinate pm modi  : ప్రధాని మోదిని హతమారుస్తామంటూ ముంబై లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు E- మెయిల్ వచ్చింది. నిఘా వర్గాలకు E-మెయిల్ పంపించారు. మోడీని చంపటానికి మా దగ్గర అన్ని సిద్ధంగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోడీ హత్య కోసం అన్ని సిద్ధం చేసుకున్నామని..20 మందితో స్లీపర్‌సెల్‌ రెడీగా ఉందని E-మెయిల్ హెచ్చరించారు. హత్య కోసం 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను కూడా సిద్దం చేసినట్టు తెలిపారు.

అంతేకాదు కోట్లాదిమందిని హత్య చేయటానికి పక్కా ప్లాన్ తో ఉన్నామని.. మెయిల్ లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 20ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ వేశామని..2 కోట్లమందిని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నామని తాము అనుకున్నది చేసి తీరుతాము అంటూ ఈ మెయిల్ లో పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ప్రధాని మోడీని హత్య చేస్తానని మెయిల్ లో ప్రకటించారు.

ఆర్​డీఎక్స్​ దాడులకు సంబంధించి కొంతమంది ఉగ్రవాదులు తనకు సహకరిస్తున్నారు అని..ఇప్పటికే ప్రధాన నగరాల్లో బాంబులు పెట్టామని తెలిపారు. ప్రధాని మోడీకి బెదిరింపు ఈ-మెయిల్‌ ఘటనపై అప్రమత్తమయ్యాయి దర్యాప్తు సంస్థలు ఈ బెదిరింపు క్రమంలో ప్రధాని మోడీకి భద్రతను కట్టుదిట్టం చేశాయి.

ఈ-మెయిల్‌పై కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశింది. వివిధ ఏజెన్సీలకు ఈమెయిల్‌ వివరాలను పంపించారు. ఎక్కడి నుంచి ఈమెయిల్‌ వచ్చింది ? ఎవరు ఈమెయిర్‌ పంపించారన్న విషయంపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఇది కచ్చితంగా టెర్రరిస్టుల పనేనని అనుమానిస్తున్నారు.