Kedarnath Landslide : కేదార్ నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి, 17 మంది గల్లంతు

పెద్ద ఎత్తున రాళ్లు, మట్టిపెల్లలు పడటంతో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, దాబాలు కొట్టుకుపోయాయి. అయితే ఆ షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతోపాటు 16 మంది నేపాలీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Kedarnath Landslide : కేదార్ నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి, 17 మంది గల్లంతు

Kedarnath landslide

Updated On : August 5, 2023 / 1:42 PM IST

Kedarnath Landslide Three Killed : కేదార్ నాథ్ యాత్రలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. కేదార్ నాథ్ సమీపంలో గౌరీకుండ్ దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముగ్గురు యాత్రికులు మరణించారు. మరో 17 మంది గల్లంతు అయ్యారు. భారీగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గౌరీకుండ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

పెద్ద ఎత్తున రాళ్లు, మట్టిపెల్లలు పడటంతో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, దాబాలు కొట్టుకుపోయాయి. అయితే ఆ షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతోపాటు 16 మంది నేపాలీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉత్తరకాశీలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి.

HIV positive : యూపీ ఆసుపత్రిలో 16 నెలల్లో 81 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ…విచారణకు ఆదేశం

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న సరిహద్దు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరాకోట్-చిన్వా మార్గంలో ఉన్న మోల్దీ దగ్గర భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. స్థానిక గ్రామస్తులతో సంబంధాలు తెగిపోయాయి.