Pub-G గేమ్ కోసం తాత అకౌంట్ నుంచి రూ.2.3 లక్షలు ఖర్చు పెట్టిన బాలుడు

Pub-G గేమ్ కారణంగా దాదాపు పిల్లలు, యువత, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రభావితం అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పబ్‌జీ పిల్లలను మెంటల్‌గానే కాదు.. ఆర్థికంగా కూడా ఇబ్బంది పెడుతుంది. లేటెస్ట్‌గా ఓ 15 ఏళ్ల బాలుడు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ఉత్తర ఢిల్లీలోని తిమార్‌పూర్‌లో 15 ఏళ్ల బాలుడు తన తాత పెన్షన్ అకౌంట్ నుంచి ఆన్‌లైన్ వాలెట్‌కు తన Pub-G గేమ్ ఆటకు నెలల తరబడి డబ్బును బదిలీ చేశాడు. ఢిల్లీ పోలీసులు కథనం మేరకు రెండు నెలల వ్యవధిలో, బాలుడు తన 65 ఏళ్ల తాత అకౌంట్ నుంచి రూ .2.34 లక్షలను బదిలీ చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్(ద్వారకా) అంటో అల్ఫోన్స్ తెలిపారు.
https://10tv.in/how-to-withdraw-pf-amount-using-umang-app/
బాలుడు ఏస్ స్థాయిలను స్కేల్ చేశాడని, అతను ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత తన PUBG అకౌంట్‌ను హ్యాక్ చేశారు” అని DCP చెప్పారు. తన తాత తన డబ్బును ఎవరు తీసుకున్నారో తెలుసుకోవటాని కేసు పెట్టగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మనవడే ఈ పని చేయడంతో కేసు ఉపసంహరించుకోవాలని తాత నిర్ణయించుకున్నా. దీంతో బాలుడిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదు.
రెండు నెలల్లో మొత్తం రూ .2.34 లక్షలు తన అకౌంట్ నుంచి పేటిఎం ఖాతాకు బదిలీ చేయబడిందని గ్రహించడానికి అతను బ్యాంకుకు వెళ్లాడు. అనంతరం మమ్మల్ని సంప్రదించారని డిసిపి చెప్పారు. సెప్టెంబర్ 1 న ఈ కేసును ఉత్తర ఢిల్లీ పోలీసు జిల్లాలోని సైబర్ శాఖకు బదిలీ చేశారు. డబ్బు ఎవరి ఖాతాలోకి బదిలీ అవుతుందో గుర్తించడానికి పేటీఎంను సంప్రదించగా.. ఫిర్యాదుదారుడి మనవడు అని తెలిసిందని డిసిపి చెప్పారు.
పోలీసులు బాలుడితో మాట్లాడినప్పుడు, అతను నెలల తరబడి ఆట ఆడుతున్నాడని, చెల్లింపుల కోసం వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఒటిపి) వచ్చినప్పుడల్లా, అతను తన తాత ఫోన్‌ను తీసుకునేవాడని, పాస్‌వర్డ్ చూసి మెసేజ్ డిలీట్ చేసేవాడని డిసిపి చెప్పారు. ఈ ఆటను భారత ప్రభుత్వం ఈ నెల మొదట్లో నిషేధించింది.