Assembly Elections Results: విజేతలెవరో..? త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో కౌంటింగ్

దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Assembly Elections Results: విజేతలెవరో..? త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో కౌంటింగ్

Assembly Elections Results

Updated On : March 2, 2023 / 11:54 AM IST

Assembly Elections Results: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగిన విషయం విధితమే. అయితే, మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో నాగాలాండ్, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ స్థానం ఏకగ్రీవం కాగా 59 అసెంబ్లీ స్థానాల చొప్పున పోలింగ్ జరిగింది. త్రిపురలో 88శాతం పోలింగ్ నమోదు కాగా.. మేఘాలయలో 76శాతం, నాగాలాండ్ రాష్ట్రంలో 84శాతం ఓట్లు పోలయ్యాయి.

Tripura Polls: త్రిపురలో తగ్గిన ఓటింగ్.. త్రిముఖ పోరు మరింత తీవ్రం అయిందా?

ఈశాన్య రాష్ట్రాల్లో మరింత విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయనేది నేటి ఫలితాల్లో తేలనుంది. త్రిపుర రాష్ట్రంలో ఫలితాలపై అందరి దృష్టీ నెలకొంది. ఈ రాష్ట్రంలో పాతికేళ్ల వామపక్ష పాలనకు తెరదించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి వచ్చిన విషయం విధితమే. ఈసారి బీజేపీని గద్దెదించేందుకు లెఫ్ట్, కాంగ్రెస్ జట్టుకట్టి ఎన్నికల బరిలో నిలిచాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. త్రిపురలో మరోసారి బీజేపీ మెజార్టీ సాధిస్తుందని అంచనా వేశాయి. బీజేపీకి 45శాతం ఓట్లు పోలయినట్లు, లెఫ్ట్ – కాంగ్రెస్ కూటమికి 32శాతం ఓట్లు, టీఎంపీ 20శాతం ఓట్లు పోలైనట్లు ఎగ్జిట్ పోల్స్ సుమారుగా అంచనా వేశాయి. అయితే,లెఫ్ట్ – కాంగ్రెస్ కూటమి మాత్రం త్రిపురలో ఈసారి అధికారంలోకి వచ్చేది మేమేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

Meghalaya, Nagaland Assembly Polling 2023: ముగిసిన పోలింగ్… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి

నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లోనూ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్డీపీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అంచనా వేశాయి. ఈ కూటమి సుమారుగా 48శాతం సీట్లు సాధిస్తుందని, మిగిలిన పార్టీలు నామమాత్రపు సీట్లతో సరిపెట్టుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే, కాంగ్రెస్, ఎన్‌పీఎఫ్ పార్టీల నేతలు మాత్రం అధికశాతం అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, మేఘాలయలో హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక్కడ ఏ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన మెజార్టీ రాకపోవచ్చని పేర్కొన్నాయి. మొత్తానికి మరికొద్దిసేపట్లో వెలువడనున్న ఫలితాల నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశం రాజకీయ వర్గాల ఉత్కంఠగా మారింది.