Gold Rate : తగ్గిన వెండి.. పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు గత ఆరు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం బంగారంపై రూ.110 పెరిగింది. వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి.

Gold Rate : తగ్గిన వెండి.. పెరిగిన బంగారం ధరలు

Gold Rate

Updated On : August 19, 2021 / 9:06 AM IST

Gold Rate : దేశంలో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఆషాడంలో కొద్దిగా తగ్గిన బంగారం ధరలు.. శ్రావణ మాసంలో పెరుగుతున్నాయి. వరుసగా ఆరవ రోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరగ్గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,330గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,300కు చేరింది.

బంగారం ధరలు పెరుగుతుంటే వెండి ధర మాత్రం తగ్గుతుంది. గురువారం వెండిపై రూ.400 తగ్గి.. 68,200 దిగొచ్చింది. వెండి వస్తువులు కొనే వారికి ఇది మంచి తరుణం అని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.01 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1784 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం పడిపోయింది. ఔన్స్‌కు 0.44 శాతం తగ్గుదలతో 23.32 డాలర్లకు క్షీణించింది.

దేశవ్యాప్తంగా బంగారం రేట్లు ఇలా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు హైదరాబాద్, విశాఖ, విజయవాడ, బెంగళూరులో రూ.44,300గా ఉంది. చెన్నైలో రూ.44,640, ముంబైలో 46,500, కోల్‌కతాలో రూ.46,750, కేరళలో రూ.44,300 పలుకుతోంది.

అదే 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో రూ.48,330 పలుకుతోంది. ఇక చెన్నైలో 48,700, ముంబైలో 47,500, న్యూఢిల్లీలో రూ.50,660, కోల్‌కతాలో రూ.49,450గా ఉంది.

మన దేశంలో ఆగస్టు 12 నుంచి బంగారం రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో 6 సార్లు పసిడి ధరలు పెరిగాయి. మూడు సార్లు స్థిరంగా ఉన్నాయి. ఒకే ఒక్కసారి తగ్గాయి. ఈ వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1030 పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.970 పెరిగింది.