J&K :పుల్వామా ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..ఇద్దరు జవాన్లు మిస్సింగ్

దక్షిణ కశ్మీర్​లోని పుల్వామా జిల్లాలోని పంపోరే టౌన్ లోని ద్రాంగ్బాల్ ఏరియాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.

J&K :పుల్వామా ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..ఇద్దరు జవాన్లు మిస్సింగ్

Ka

Updated On : October 16, 2021 / 5:12 PM IST

J&K  దక్షిణ కశ్మీర్​లోని పుల్వామా జిల్లాలోని పంపోరే టౌన్ లోని ద్రాంగ్బాల్ ఏరియాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో లష్కరే కమాండర్​ ఉమర్ ముస్తాక్​ ఖాండే ఉన్నాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు

మరోవైపు, పూంచ్ లో సోమవారం నుంచి ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఒక జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ (జేసీవో)తో కలిపి ఇద్దరు జవాన్ల కోసం ఆర్మీ భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్‌ చేపట్టినట్లు ఒక అధికారి తెలిపారు.

ఈ ప్రాంతంలో సోమవారం మొదలైన్‌ ఎన్‌కౌంటర్‌ ఆరో రోజుకు చేరింది. ఇప్పటి వరకు ఒక జేసీవో, ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఇటీవల సంవత్సరాలలో ఓ ఎన్ కౌంటర్ లో భారీ స్థాయిలో జవాన్లను కోల్పోవడం ఇదే తొలిసారి. అయితే కశ్మీర్ లో ఇటీవల జరిగిన తొమ్మిది ఎన్ కౌంటర్లలో మొత్తం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. మరోవైపు భద్రతా కారణాల నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి పూంజ్‌-జమ్ము జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు