Bharat Bandh: రెండ్రోజుల పాటు భారత్ బంద్‍‌కు పిలుపు, బ్యాంకులకు తిప్పలు

ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. మార్చి 28, మార్చి 29న..

Bharat Bandh: రెండ్రోజుల పాటు భారత్ బంద్‍‌కు పిలుపు, బ్యాంకులకు తిప్పలు

Bharath Bandh

Bharat Bandh: ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. మార్చి 28, మార్చి 29న జాతీయవ్యాప్తంగా బంద్ కోసం సహకరించాలని ఢిల్లీ వేదికగా మార్చి 22న జరిగిన సెంట్రల్ ట్రేడింగ్ యూనియన్స్ మీటింగ్ లో వెల్లడించారు. ఈ మేరకు బంద్ లో పాల్గొననున్న రెండ్రోజుల పాటు వర్కర్లకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా, జాతీయ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు నిరసన తెలియజేయనున్నారు.

ఈపీఎఫ్ జమపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. పెట్రోల్, ఎల్‌పీజీ, కిరోసిన్, సీఎన్‌జీ మొదలైనవాటిలో ఆకస్మిక పెంపుదల, మానిటైజేషన్ (పీఎస్‌యూ ల్యాండ్ బండిల్స్) ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ద్రవ్యోల్బణం, క్రాష్ అవుతున్న షేర్ మార్కెట్ల కారణంగా మాత్రమే వాటిని నిలిపివేశారు. సమావేశాంలో ఇటువంటి విధానాలన్నింటినీ ఖండించారు.

మార్చి 28, 29 తేదీల్లో గ్రామీణ బంద్‌ను పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా చేసిన పునరుద్ఘాటనకు సమావేశం మద్దతు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనాలని రాష్ట్ర స్థాయిల్లోని వివిధ సంఘాలకు సమావేశం విజ్ఞప్తి చేసింది. ఈ ఉమ్మడి ఫోరమ్‌లో కేంద్ర కార్మిక సంఘాలైన INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC భాగంగా ఉన్నారు.

Read Also : నేటి నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్

బ్యాంకింగ్ రంగం సైతం సమ్మెలో పాల్గొంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫేస్‌బుక్‌లో తెలిపింది.

“బ్యాంక్ సమ్మె రోజులలో తమ బ్రాంచ్‌లు, వాటి ఆఫీసులలో సాధారణ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, సమ్మె కారణంగా బ్యాంకులో పని పరిమిత స్థాయిలో మాత్రమే జరగొచ్చు” అని SBI స్టేట్మెంట్ విడుదల చేసింది.

భారత్ బంద్‌లో పాల్గొనబోయే రంగాలు
* ఎస్మా (హర్యానా, చండీగఢ్) ముప్పు పొంచి ఉన్నప్పటికీ రోడ్డుమార్గాలు, రవాణా కార్మికులు, విద్యుత్ కార్మికులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన పేర్కొంది.
* బ్యాంకింగ్, బీమా సహా ఆర్థిక రంగాలు సమ్మెలో పాల్గొంటున్నాయని పేర్కొంది.
* బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి, బ్యాంకులు, బీమా తదితర రంగాలకు చెందిన యూనియన్లు సమ్మె నోటీసులు ఇచ్చాయని కూడా పేర్కొంది.
* రైల్వే, రక్షణ రంగానికి చెందిన యూనియన్లు వందలాది చోట్ల సమ్మెకు మద్దతుగా పెద్దఎత్తున ఉద్యమించనున్నాయని పేర్కొంది.