అమ్మినా అంతరాదంట : స్కూటీకి రూ.16 వేల ఫైన్
కొత్త వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. హర్యానాకు చెందిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు రూ. 16 వేలు జరిమానా విధించారు.

కొత్త వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. హర్యానాకు చెందిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు రూ. 16 వేలు జరిమానా విధించారు.
కొత్త వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. 2019, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మోటారు వాహనాల చట్టం-2019 అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే హర్యానాకు చెందిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు రూ. 16 వేలు జరిమానా విధించారు.
బుధవారం (సెప్టెంబర్ 4, 2019) ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టగా స్కూటీని డ్రైవ్ చేస్తున్న ముకుల్ అడ్డంగా దొరికిపోయాడు. అతని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్‌సీ)తో పాటు మిగతా ఆధారాలు లేకపోవడంతో రూ. 16 వేలు ఫైన్ వేశారు. పోలీసులు అతని స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. స్కూటీ అమ్మినా అంతరాదు అంటున్నారు ముకుల్. అమ్మి కట్టటానికి బండి కూడా చేతిలో లేదని.. ఇప్పుడేం చేయాలని ప్రశ్నిస్తున్నాడు. స్కూటీ లేదు.. చేతిలో డబ్బులు లేవు.. బండి కావాలంటే డబ్బులు కావాలి.. డబ్బులు కావాలంటే బండి చేతిలో ఉండాలి.. ఈ రెండు ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు అంటున్నాడు ముకుల్. మొత్తంగా స్కూటీ అమ్మినా అంత డబ్బు వచ్చే పరిస్థితి లేదంటూ ఆవేదన వెలిబుచ్చాడు బాధితుడు ముకుల్.
ఇప్పటికైనా వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీతో పాటు ఇతర ఆధారాలు వెంట తెచ్చుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మంగళవారం (సెప్టెంబర్ 3, 2019)వ తేదీన హర్యానా పోలీసులు గురుగ్రామ్‌కు చెందిన దినేశ్ మదన్‌కు రూ. 23 వేల జరిమానా విధించారు. అతను స్కూటీ నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. మదన్ వద్ద డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, థర్ట్ పార్టీ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్‌తో పాటు హెల్మెట్ కూడా లేకపోవడంతో జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.