దేశంలో ఫస్ట్ టైమ్ : ట్రక్కుకి రూ.2లక్షలు ట్రాఫిక్ జరిమానా

ట్రాఫిక్ చలాన్లలో రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్నటివరకు వేలకు వేల ఫైన్లతో వాహనదారులను బెదరగొట్టిన అధికారులు.. తమ ప్రతాపాన్ని మరింతగా పెంచారు. ఫలితంగా

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 01:49 AM IST
దేశంలో ఫస్ట్ టైమ్ : ట్రక్కుకి రూ.2లక్షలు ట్రాఫిక్ జరిమానా

Updated On : September 13, 2019 / 1:49 AM IST

ట్రాఫిక్ చలాన్లలో రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్నటివరకు వేలకు వేల ఫైన్లతో వాహనదారులను బెదరగొట్టిన అధికారులు.. తమ ప్రతాపాన్ని మరింతగా పెంచారు. ఫలితంగా

కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చాక చలాన్లలో రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు కొత్త రికార్డ్ క్రియేట్ అయ్యింది. దేశంలో ఇదే ఫస్ట్ టైమ్. నిన్నటివరకు వేలకు వేల ఫైన్లతో వాహనదారులను బెదరగొట్టిన అధికారులు.. తమ ప్రతాపాన్ని మరింతగా పెంచారు. ఫలితంగా చలాన్లు వేలను దాటి లక్షల్లోకి చేరాయి. తాజాగా ఓ ట్రక్కు డ్రైవర్‌కు ఏకంగా రూ.2 లక్షలకుపైగా జరిమానా విధించడం హాట్ టాపిక్‌గా మారింది. కొత్త వాహన చట్టంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. భారీగా ఫైన్‌లు విధిస్తుండడతో రోడ్లపైకి వాహనాలను తీసుకెళ్లాలంటేనే జంకుతున్నారు. వాహనాల ధరకు మించి జరిమానాలు విధిస్తుండటంతో హడలిపోతున్నారు. అయినా… అధికారులు ఊరుకోవట్లేదు. మొన్నటి వరకు వేలల్లోనే చూసిన ఈ జరిమానాలు.. ఇప్పుడు ఏకంగా లక్షల్లోకి చేరాయి. తాజాగా ఢిల్లీలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు రూ.2 లక్షల 500 జరిమానా విధించారు.

దేశ రాజధానిలోని ముకర్బా చౌక్ ప్రాంతంలో.. ఓవర్‌ లోడ్‌ కారణంగా ట్రక్కు డ్రైవర్‌కు 2లక్షల 500 రూపాయాలు ఫైన్ వేశారు. అంతేకాదు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. నూతన వాహన చట్టం ప్రకారం ట్రక్కులో పరిమితికి మించి లోడ్ ఉన్నందున 20వేల రూపాయల జరిమానా విధించారు. దానికి అదనంగా… నిర్దేశించిన లోడ్‌కు మించి తీసుకెళ్తున్న ప్రతి టన్నుకు 2వేల చొప్పున ఫైన్ వేసి.. మొత్తం రూ.2లక్షల 500 రసీదును చేతిలో పెట్టారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన జరిమానాల రికార్డులను ఈ చలాన్ తిరగ రాసింది. 

ట్రక్కు డ్రైవర్ పేరు రామ్ కిషన్. ఓవర్ లోడ్ కారణంగా 2లక్షల 500 రూపాయలు జరిమానాగా చెల్లించాడు. బుధవారం(సెప్టెంబర్ 11,2019) రాత్రి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు రామ్ కిషన్ ట్రక్కుని ఆపారు. ఆ బండిపై హర్యానా నెంబర్ ప్లేట్ ఉంది. రామ్ కిషన్ ట్రక్కుకి 25 టన్నుల వరకు లోడ్ ని తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఉంది. కానీ ట్రక్కులో 43 టన్నుల వరకు లోడ్ ఉంది. ఇది పరిమితికన్నా 18 టన్నులు అధికం. ఓవర్ లోడ్ మాత్రమే కాదు.. 10 రకాల ట్రాఫిక్ రూల్స్ ని కూడా రామ్ కిషన్ బ్రేక్ చేశాడు. సీటు బెల్టు పెట్టుకోలేదు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు.  

కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రావడంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు పడుతున్నాయి. రాజస్థాన్ కి చెందిన ట్రక్కు డ్రైవర్‌కు లక్ష 41వేల 700 రూపాయలు ఫైన్ వేసిన 3 రోజుల్లోనే… ఇప్పుడు ఏకంగా 2లక్షల జరిమానా విధించడం మరింత సంచలనం రేపుతోంది. మున్ముందు.. ఈ ఫైన్లు ఏ రేంజ్‌కి వెళ్తాయో చూడాలి.