వారిని ఇండియాకు పంపించేస్తున్న ట్రంప్.. ఎంతమంది భారతీయులపై ప్రభావం పడుతుందో తెలుసా?
ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా భారతీయులను పంపించేస్తున్నారు.

Donald Trump
అక్రమ వలసదారులపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి విమానాల్లో వారి దేశాలకు పంపిస్తున్నారు. దీంతో అమెరికాలోని లక్షలాది మంది అక్రమ వలసదారులు ఆ దేశాన్ని వీడాల్సి వస్తుంది.
ఇప్పటికే పలు విమానాల్లో భారతీయులు సహా పలు దేశాల వారిని అమెరికా అధికారులు పంపిస్తున్నారు. తొలి దశలో దాదాపు 130 మంది భారతీయులను అమెరికా అధికారులు తాజాగా విమానం ఎక్కించి పంపినట్లు తెలుస్తోంది. ఇకపై ఇటువంటి విమానాలు వస్తూనే ఉంటాయని తెలుస్తోంది.
ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల అమెరికాలోని ఎంత మంది భారతీయులపై ఈ ప్రభావం పడుతుందో తెలుసా? ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం వేలాది మంది భారతీయులు అమెరికాను వీడాల్సి ఉంటుంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం.. అమెరికాలో భారతదేశానికి చెందిన సుమారు 7,25,000 మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నారు.
Crime News: 20 ఏళ్ల యువతిని చైనుతో కట్టేసి 2 నెలలుగా ఇంట్లోనే..
మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత అమెరికాలో ఉన్న అత్యధిక మంది అక్రమ వలసదారులు మన దేశంలోని వారే. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిలో 18,000 మంది భారతీయులను ఇప్పటికే ఇండియా, అమెరికా గుర్తించాయి. అలాగే, సరైన పత్రాలులేని 20,407 మంది భారతీయులు కూడా ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల ఆ దేశాన్ని వీడాల్సి వస్తుంది.
ఈ లెక్కలు అన్నీ 2022లో వేసినవి. ఇప్పుడు అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చు. భారతీయులతో పాటు అన్ని దేశాలవారితో కలిపి అమెరికాలో అక్రమ వలసదారులు మొత్తం 1.1 కోట్ల మంది ఉన్నారు. అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపేందుకు ట్రంప్ సర్కారు తమ వాణిజ్య విమానాలు, సైనిక విమానాలను వాడుతోంది.