Medication : తగ్గనున్న టీబీ,షుగర్,కేన్సర్ మందుల ధరలు..
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల మందుల ధరలను తగ్గించాలన్న ఆలోచన చేస్తుంది. జాతీయ అత్యవసర ఔషదాల జాబితాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించనుంది. ఔషద భారాల నుండి

Medication
Medication : కేన్సర్, షుగర్, టీబీ రోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. ఈ వ్యాధులకు సంబంధించి మందుల కొనుగోలు చేయటం రోగులకు పెద్ద భారంగా మారింది. ఈనేపధ్యంలో దీర్ఘకాలికంగా ఉపయోగించాల్సిన మందులు కావటంతో వీటిని తప్పనిసరిగా రోగులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. చాలా మంది వీటిని కొనుగోలు చేయలేక, రోజువారిగా మందులు సక్రమంగా వాడుకోలేని పరిస్ధితుల్లో కన్నుమూస్తున్నారు.
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల మందుల ధరలను తగ్గించాలన్న ఆలోచన చేస్తుంది. జాతీయ అత్యవసర ఔషదాల జాబితాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించనుంది. ఔషద భారాల నుండి రోగులకు ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కేన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల చికిత్సలో భాగంగా వినియోగించే 39రకాల మందులు, టీకాల ధరలను త్వరలో తగ్గించనుంది.
జాతీయ అత్యవసర ఔషదాల జాబితాలో చేర్చిన మందులను ఏధరకు విక్రయించాలన్నది ఎన్ పీపీఏ నిర్ణయిస్తుంది. ఎన్ ఎల్ ఇఎంలో 39 ఔషదాలను చేర్చనున్న ప్రభుత్వం మరో 16 ఔషదాలను జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదించనుంది. ఎరిత్రోమైసిన్, బ్లీచింగ్ పౌడర్, ఎయిడ్స్ మందులు వంటివి ఈ తొలగించే జాబితాలు ఉన్నట్లు తెలుస్తుంది.