Tunisha Sharma Suicide : ప్రముఖ యువ నటి ఆత్మహత్య.. మేకప్ రూమ్‌లోనే ఉరి వేసుకుంది

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ, సీరియల్ యువ నటి తునీషా శర్మ ఆత్యహత్య చేసుకుంది. ఆమె వయసు 20 సంవత్సరాలు. ముంబైలో ఓ షూటింగ్ సెట్ లోని మేకప్ రూమ్ లో ఆమె ఉరేసుకుంది. సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, తునీషా శర్మ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Tunisha Sharma Suicide : ప్రముఖ యువ నటి ఆత్మహత్య.. మేకప్ రూమ్‌లోనే ఉరి వేసుకుంది

Updated On : December 24, 2022 / 8:53 PM IST

Tunisha Sharma Suicide : సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ, సీరియల్ యువ నటి తునీషా శర్మ ఆత్యహత్య చేసుకుంది. ఆమె వయసు 20 సంవత్సరాలు. ముంబైలో ఓ షూటింగ్ సెట్ లోని మేకప్ రూమ్ లో ఆమె ఉరేసుకుంది. సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, తునీషా శర్మ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

చక్రవర్తి అశోక్ సామ్రాట్, మహారాణా ప్రతాప్, అలీబాబా వంటి పలు సీరియల్స్ తో పాటు దబాంగ్ 3, కహానీ 2 వంటి చిత్రాల్లోనూ తునీశా శర్మ నటించి గుర్తింపు తెచ్చుకుంది. తునీశా శర్మ ఆత్యహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగింది? ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు.

Also Read..Mahesh Babu: మహేష్ ఫ్యాన్‌కు మసూద పాప రిప్లై.. అంటే అన్నారు కానీ..!

తునీషా శర్మ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ స్టార్ట్ చేసింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. ప్రస్తుతం సోనీ సబ్‌ టీవీలో ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో కీలక పాత్రను పోషిస్తోంది. ఈ సీరియల్‌లో షహజాది మరియమ్‌ పాత్రలో ఆమె నటిస్తోంది.

ఫితూర్‌, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 సినిమాల్లో కూడా కనిపించింది. బార్ బార్ దేఖో సినిమాలో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రను తునీషా పోషించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటి ఇలా ఆత్మహత్య చేసుకోవడం పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. తునీషా మంచి నటి అని.. ఆమె ఇలా చేయడం నమ్మలేకపోతున్నామని సహ నటులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read..Mahesh Babu: మహేష్ ఫ్యాన్‌కు మసూద పాప రిప్లై.. అంటే అన్నారు కానీ..!

యువ నటి ఆత్మహత్య వార్త ఇండస్ట్రీలో కలకలం రేపింది. పరిశ్రమ వర్గాల్లో విషాదం నింపింది. ఈ వార్త తెలిసి తునీశా శర్మ కుటుంబసభ్యులు, సన్నిహితులు షాక్ కి గురయ్యారు. తునీశా శర్మ ఆత్మహత్య చేసుకుందంటే వారు నమ్మలేకపోతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.