TV Serials : టీవీ సీరియల్స్ షూటింగ్ లు రద్దు

Tv Serial Shootings Shut Down
TV Serial shootings shut down in Maharashtra : దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ ఉండటంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ ప్రకటించింది. తాజాగా ఇప్పడు టీవీ సీరియల్స్ షూటింగ్ లను కూడా నిలిపి వేయాలని ఆదేశించింది. ముంబైలో జరిగే అన్ని టీవీ సీరియళ్ల షూటింగ్ లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మినీలాక్ డౌన్ లో భాగంగా రాష్ట్రంలో ఉదయం పూట 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వారాంతాల్లో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు సంపూర్ణ లాకౌ డౌన్ అమల్లో ఉంటోంది.