TVK Vijay: బిగ్ బ్రేకింగ్.. విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు
ప్రస్తుతం టీవీకేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి 112 మందే ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118.
TVK Vijay: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రేపు టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రద్దైంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిసార్టులోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు.
రేపు ఉదయం 11.30 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని విజయ్ భావించారు. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ అనుమతి కూడా కోరారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన బలం టీవీకేకు లేదు. మెజార్టీ సంఖ్య లేని కారణంగా ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో రేపు జరగాల్సిన ప్రమాణ స్వీకారం రద్దైంది. ప్రస్తుతం టీవీకేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి 112 మందే ఉన్నారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118.
Also Read: ఛ.. రజినీకాంత్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అదే జరిగుంటే సీఎం అయ్యేవారా?
