అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంతో జీవితం విలువ తెలిసొచ్చింది.. విడాకులు రద్దు చేసుకోవాలని దంపతుల నిర్ణయం

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాగేశ్వరి ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ... విమాన ప్రమాదం తర్వాత చాలామంది తమ కుటుంబ సభ్యులతో మళ్లీ కలుస్తున్నారని అన్నారు.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంతో జీవితం విలువ తెలిసొచ్చింది.. విడాకులు రద్దు చేసుకోవాలని దంపతుల నిర్ణయం

Updated On : June 17, 2025 / 1:39 PM IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం ఎంతమంది కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఏ క్షణాన ప్రాణాలు పోతాయో ఎవరూ చెప్పలేరని, బతికున్నన్నాళ్లు అందరితోనూ కలిసిమెలసి ఉండాలని చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అలనాటి గాయని, నటి రాగేశ్వరి ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపిన రెండు జంటల స్టోరీ వైరల్ అవుతోంది. విమాన ప్రమాదం వల్ల ఆ నలుగురికి జీవితం విలువ తెలిసొచ్చిందని చెప్పారు. ఆ రెండు జంటలు విడాకులు రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయని ఆ గాయని వివరించారు. ఆ జంటలు తనకు బాగా కావాల్సిన వారేనని అన్నారు. వారి పేర్లు, ఇతర వివరాలను ఆమె బయటపెట్టలేదు.

ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాగేశ్వరి ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ… విమాన ప్రమాదం తర్వాత చాలామంది తమ కుటుంబ సభ్యులతో మళ్లీ కలుస్తున్నారని అన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరిగితేనే మనం ఎవరి అవసరం ఎంతమేర ఉందో గుర్తిస్తామని తెలిపారు.

Also Read: “G7” నుంచి వెళ్తూ “కాల్పుల విరమణ కోసం కాదు.. అంతకు మించి” అంటూ ట్రంప్ మరో సంచలనం.. ఏం జరగబోతోంది?

మనలో మార్పునకు ఇటువంటి ఘటనలు నాంది పలుకుతుంటాయని చెప్పారు. ఇగోలను, సుదీర్ఘకాలం పాటు ఉన్న వివాదాలను పక్కనపెట్టి చాలా మంది కలిసిపోతున్నారని అన్నారు.

రాగేశ్వరి వ్యాఖ్యలు చాలా మందిని కదిలించాలి. సరైన సమయానికి, సరైన విషయాలు చెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాగేశ్వరి 1990లో ఆంఖేన్, మెయిన్ ఖిలాడీ తూ అనారి, జిడ్ వంటి సినిమాల్లో నటించారు. గాయకురాలిగా కూడా ‘ఒసాకా మురైయా’, ‘దునియా’, ‘ప్యార్ కా రంగ్’ వంటి ఆల్బమ్‌లతో గుర్తింపు పొందారు. ఇటీవల ‘సావీ’ అనే సినిమాలో మళ్లీ కనిపించారు.

కాగా, జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Raageshwari 🌏 (@raageshwariworld)