Kerala : గూగుల్ మ్యాప్ అనుసరించి డ్రైవింగ్.. కేరళ పెరియార్ నదిలో కారు పడి, ఇద్దరు వైద్యులు మృతి

అయితే గూగుల్ మ్యాప్‌ల సూచనల మేరకు డ్రైవర్ ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా దారి కనపడకపోవడంతో గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో వెళ్లారు. 

Kerala : గూగుల్ మ్యాప్ అనుసరించి డ్రైవింగ్.. కేరళ పెరియార్ నదిలో కారు పడి, ఇద్దరు వైద్యులు మృతి

car plunges into periyar river

Updated On : October 2, 2023 / 12:00 PM IST

Kerala Two Doctors Died : కేరళలోని పెరియార్ నదిలో కారు పడి పోవడంతో ఇద్దరు వైద్యులు మృతి చెందారు. ఆదివారం గోతురుత్ వద్ద కారు పెరియార్ నదిలో పడిపోవడంతో ఇద్దరు యువ వైద్యులు మరణించారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు అద్వైత్ (29), అజ్మల్ (29)గా గుర్తించారు. జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అద్వైత్, అజ్మల్ పని చేస్తున్నారు.

వీరితో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం క్షఃతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే గూగుల్ మ్యాప్‌ల సూచనల మేరకు డ్రైవర్ ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా దారి కనపడకపోవడంతో గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో వెళ్లారు.

Google Map : గూగుల్ మ్యాప్ అనుసరిస్తూ కూలిన వంతెనపై కారు నడుపుతూ మరణించిన వ్యక్తి.. గూగుల్ నిర్లక్ష్యంపై దావా వేసిన అతని కుటుంబం

అయితే మ్యాప్‌ సూచించిన విధంగా ఎడమవైపు మలుపు తీసుకోకుండా పొరపాటున ముందుకు వెళ్లి కారు నదిలో పడిపోయినట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

ఓ మహిళ సహా ముగ్గురు ప్రయాణికులను రక్షించినట్లు స్థానికులు మీడియాకు వివరించారు. చనిపోయిన ఇద్దరు వైద్యుల మృతదేహాలను వెలికితీసేందుకు అధికారులు స్కూబా డైవింగ్ బృందాన్ని రంగంలోకి దింపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.