Jammu Airport : డ్రోన్ దాడిలో కీలక విషయాలు, పాక్ ఉగ్రవాదుల పనే!

జమ్మూ ఎయిర్‌బేస్‌పై జరిగిన డ్రోన్‌ దాడి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రోన్‌ దాడిపై.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నివేదికను అందజేసింది. డ్రోన్ల సాయంతో పేలుళ్లకు పాల్పడిన ఐఈడీ బాంబ్‌లో.. ఆర్డీఎక్స్‌, నైట్రేట్‌ వినియోగించినట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ తేల్చింది.

Drone

Two Drones Attack : జమ్మూ ఎయిర్‌బేస్‌పై జరిగిన డ్రోన్‌ దాడి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రోన్‌ దాడిపై.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నివేదికను అందజేసింది. డ్రోన్ల సాయంతో పేలుళ్లకు పాల్పడిన ఐఈడీ బాంబ్‌లో.. ఆర్డీఎక్స్‌, నైట్రేట్‌ వినియోగించినట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ తేల్చింది. దేశంలో ఆర్డీఎక్స్‌ లభ్యం కావడం లేదని.. పాకిస్థాన్‌ నుంచే ఆర్డీఎక్స్‌ను తెచ్చి ఉంటారని భావిస్తున్నారు అధికారులు. డ్రోన్‌ దాడి వెనుక పాక్‌ ఉగ్రవాదులే ఉన్నారని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు.. దాడికి ఉపయోగించిన జీపీఎస్‌ డ్రోన్‌ కూడా చైనా ప్రొడక్ట్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు.

Read More : BJP-Shiv Sena : అమీర్ ఖాన్-కిరణ్ రావు లాంటిదే బీజేపీ-శివసేన బంధం
మరోవైపు…వరుస డ్రోన్‌ దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని జాతీయ భద్రతా దళాలు(NSG)మరింత అలర్ట్ అయ్యాయి. శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు బుధవారం జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్‌ కౌంటర్‌ వ్యవస్థ ఏర్పాటు చేశాయి భద్రతా బలగాలు. డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలో మార్పులు చేస్తున్నట్లు చెప్పిన ఆధికార వర్గాలు.. జమ్ము వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్‌, జామర్లను అమర్చడం సహా డ్రోన్‌ విధ్వంసక తుపాకులను మోహరించినట్లు తెలిపాయి.

గడిచిన కొద్ది రోజుల్లో ఏడు డ్రోన్లు జమ్మూలోని మిలటరీ స్టేషన్ల వద్ద కలకలం రేపాయి. అయితే భారత్‌కు చెందిన కీలక స్థావరాలపై డ్రోన్ల ద్వారా పాకిస్తాన్‌ దాడులకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి కేసుని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

Read More : Real Tarzan : రియల్ టార్జాన్..40ఏళ్లు అడువుల్లోనే..