Real Tarzan : రియల్ టార్జాన్..40ఏళ్లు అడువుల్లోనే..

టార్జాన్. అడవి మనిషి. సినిమాల్లో చూశాం.కానీ రియల్ గా నిజంగా టార్జాన్లు ఉంటారా? సినిమాల్లో ప్రమాదవశాత్తు అడవిలో తప్పిపోయే..లేదా మరేదో కారణాలతో టార్జాన్ గా మారిపోయినట్లుగా చూస్తుంటాం. వియత్నాంలో ఉన్న ఓ వ్యక్తిని చూస్తే నిజమేననిపిస్తుంది. ఇతను అడవిల్లో అచ్చంగా టార్జాన్ లా జీవించాడు.

Real Tarzan : రియల్ టార్జాన్..40ఏళ్లు అడువుల్లోనే..

Real Tarzan Hoan Long (1)

Real Tarzan Hoan Long : టార్జాన్. అడవి మనిషి. సినిమాల్లో చూశాం.కానీ రియల్ గా నిజంగా టార్జాన్లు ఉంటారా? సినిమాల్లో ప్రమాదవశాత్తు అడవిలో తప్పిపోయే..లేదా మరేదో కారణాలతో టార్జాన్ గా మారిపోయినట్లుగా చూస్తుంటాం. అటువంటివే మోగ్లీ, టార్జాన్ వంటి సినిమాలు..నిజంగా అలాంటివారు ఉంటారా? అనిపిస్తుంది. వియత్నాంలో ఉన్న ఓ వ్యక్తిని చూస్తే నిజమేననిపిస్తుంది. ఇతను అడవిల్లో అచ్చంగా టార్జాన్ లా జీవించి ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చాడు. అని పేరు ‘హోవాన్ లాంగ్’ వియత్నాంలో అతన్ని రియల్ లైఫ్ టార్జాన్ అంటున్నారు.

హోవాన్ లాంగ్. వియత్నాం అడవుల్లో 41 సంవత్సరాల పాటు జీవించాడు. అచ్చం టార్జాన్ లాగా. 1972 లో జరిగిన వియత్నాం యుద్ధం సమయంలో హోవాన్ లాంగ్ అడవుల్లోకి వెళ్లిపోయాడు. టే ట్రా జిల్లాలోని క్వాంగ్ నాయ్ ప్రావిన్స్ మధ్యలో ఉన్న అడవిలో నివాసం ఉండేవాడు. అది దట్టమైన అడవి కావడంతో ఎవరూ అక్కడికి వెళ్లేందుకు సాహసించలేదు. భయంతో ఆ చుట్టుపక్కలకు ఎవ్వరూ వెళ్లేవారు కాదు. దీంతో అలా40 సంవత్సరాలలో అడవిలోనే ఉండిపోయారు.

అడవిలో తేనె, పండ్లు, చిన్న చిన్న అడవి జంతువులు తిం అడవిలో లభించే కర్రలతోనే నివాసం ఏర్పాటు చేసుకుని..వాటితోనే ఆయుధాలు తయారుచేసుకొని అడవి జంతువుల నుంచి తమని తాము కాపాడుకునేవాడు. 2015 లో ఓ ఫొటోగ్రాఫర్ అడవిలోకి వెళ్లి వీరి ఫోటోలను తీయటంతో ఇతని గురించి బయటప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం కాపాడి బయటకు తీసుకొచ్చి ఓ గ్రామంలో ఉంచింది. ఆ గ్రామానికి వచ్చేవరకూ హోవాన్ లాంగ్ కు మహిళలు అనేవారు ఉంటారని వారు ప్రత్యేకంగా ఉంటారని తెలీదని చెబుతున్నాడు వాన్ లాంగ్. లాంగ్ కు బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలీదు. అతని మాటలు..చేతలు అన్నీ చిన్నపిల్లాడిమాదిరిగానే ఉంటాయి. అందుకే అతన్ని ఆ గ్రామస్తులంతా చిన్నపిల్లవాడిగా నే భావిస్తున్నారు. ఎటువంటి కోరికలు అతనికి లేవని అతని వ్యవహరించే తీరును బట్టి తెలుస్తోందని స్థానికులు అంటున్నారు.

మనుష్య సమాజం నుంచి దూరంగా పెరగడంతో మనుషులు పాటించే పద్ధతులు తెలీవు. పద్ధతులే కాదు చిన్న చిన్న అలవాట్లు కూడా లాంగ్ కి తెలీవు. ఇది మంచి అనీ ఇది చెడు అనీ తెలీదు. ఎవరైనా అతడిని కొట్టమంటే బలంగా కొట్టడమే కానీ… కొట్టకూడదనే విషయం తెలీదటంటున్నారు స్థానికులు. ఐతే ఇన్ని ఇబ్బందులు ఉన్నా..లాంగ్ కొత్త ప్రపంచంలో ఇమిడిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన కొత్తలో చాలారకాల ఆరోగ్య సమస్యలు ఎదురైనా.. అతడికి కొత్త జీవితం ఎంతగానో నచ్చుతోందట.

కానీ ప్రశాంతమైన అడవి వాతావరణం నుంచి వచ్చిన లాంగ్ కు ఈ సమాజం అంతా గోల గోలగా ఉందంటున్నాడు. జంతువులు మనుషులతో ప్రేమగా వ్యవహరించడం చూసి ఆనందంగా అనిపిస్తోందని అంటున్నాడు వాన్ లాంగ్. అడవిలో ఉన్నప్పుడు జంతువులు తమని చూసి పారిపోయేవని.. ఇప్పుడు కొత్తగా అవి దగ్గరికి వస్తుంటే సంతోషంగా అనిపిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఏమైనా ఈ రియల్ లైఫ్ టార్జాన్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.