మృగాళ్ల పైశాచికత్వం : వెలివేసిన మహిళపై వృద్ధుల అత్యాచారం

అన్యాయానికి గురైన మహిళపై దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు వృద్ధులు. ఆదుకుంటారని ఆశపడి నమ్మిన ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఈ దారుణ ఘటన గుజరాత్ లోని బనాస్ కంతా జిల్లాలో చోటుచేసుకుంది.
ధర్నాల్ గ్రామానికి చెందిన బాధితురాలి వయస్సు 50 ఏళ్లు. ఆమె కొడుకు ఇటీవల కులాంత వివాహం చేసుకున్నాడు. దీంతో కులం పిచ్చి ఉన్నపెద్దలు ఆమె కుటుంబాన్ని వెలివేశారు. అదే గ్రామానికి చెందిన రణ్‌చోఢ్‌భాయ్ సుతార్,విజోల్ భాయ్ సుతార్ లు అనే వ్యక్తులు ఆమెను ఆదుకుంటామని తమ కులంలో కలుపుకుంటామని సాయం చేస్తామని నమ్మించారు. రణ్‌చోఢ్‌భాయ్ సుతార్,విజోల్ భాయ్ సుతార్ ఇద్దరికీ 65 ఏళ్లు పైనే ఉంటాయి.
ఆమె కుటుంబాన్ని తిరిగి తమ కుటుంబాల్లో కలుపుకుంటామని ఆమెను నమ్మించిన సదరు ఇద్దరు వ్యక్తులు..ఈ విషయంపై పూర్తిగా నీతో మాట్లాడాలని చెప్పి..థారా టౌన్ అనే ప్రాంతానికి పిలిపించారు. ఆమె వెళ్లింది. మీ కుటుంబంతో తాము మళ్లీ తిరిగి కలవాలన్నా..నువ్వు మా కోరిక తీర్చాలంటూ బ్లాక్ మెయిల్ చేసారు. ఆమె భయపడిపోయింది. నమ్మించి ఇలా బాధ పెట్టవద్దంటూ బతిమాలుకుంది. కానీ ఆ కామాంధులు కనికరించలేదు..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికన్నా చెబితే చంపేస్తామని బెదిరించారు.
దీంతో భయపడిపోయిన ఆమె కొంత కాలంపాటు మౌనంగా ఉండిపోయింది. తరువాత వారు పదే పదే వేధించటంతో దిక్కుతోచని పరిస్థితిలో మంగళవారం (నవంబర్ 19)న పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు కామాంధులిద్దరూ తనను బ్లాక్ మెయిలింగ్‌కు చేసిన క్లిప్‌ను కూడా పోలీసులకు చూపించింది.
వెంటనే సామూహిక అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్ కేసులు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె చూపిన ఆధారాలతో..రణ్‌చోఢ్‌భాయ్ సుతార్,విజోల్ భాయ్ సుతార్ సామూహిక అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన వారిద్దరూ పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నామని సబ్ ఇన్‌స్పెక్టర్ ఎంబి దేవ్దా తెలిపారు.