Jammu And Kashmir : జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు అరెస్టు

ఇద్దరు వ్యక్తులు భద్రతా బలగాలను గమనించి పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు వారిని చాకచక్యంగా పట్టుకున్నాయని పోలీసు ప్రతినిధి తెలిపారు.

Jammu And Kashmir : జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు అరెస్టు

Militants Arrest

Updated On : June 1, 2023 / 5:01 PM IST

Lashkar-e-Toiba Militants Arrested : జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు మిలిటెంట్లు అరెస్టు అయ్యారు. బారాముల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు గురువారం అరెస్టు చేశాయి. వారి దగ్గర నుంచి ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఫ్రెస్టిహార్ క్రీరి గ్రామంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి పక్కా సమాచారం రావడంంతో పోలీసులు.. భద్రతా బలగాలతో కలిసి ఫ్రెస్టిహార్ వారిపోరా క్రాసింగ్ దగ్గర మొబైల్ చెక్ పాయింట్ ను ఏర్పాటు చేశారు.

అటువైపుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు భద్రతా బలగాలను గమనించి పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు వారిని చాకచక్యంగా పట్టుకున్నాయని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇద్దరు ఎల్ఈటీకి చెందిన మిలిటెంట్లని వెల్లడించారు. తనిఖీ చేయగా రెండు చైనీస్ పిస్టల్స్, రెండు మ్యాగజైన్లు, 15 పిస్టల్ రౌండ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Terrorist Killed : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఫ్రెస్టిహార్ క్రీరికి చెందిన సుహైల్ గుల్జార్, హుడిపోరా రఫియాబాద్ కు చెందిన వసీమ్ అహ్మద్ గా గుర్తించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మే 27న బారాముల్లా జిల్లా నాబాల్ లో ఎల్ఈటీకి చెందిన వ్యక్తిని సైతం బలగాలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తి పోలీసు, భద్రతా బలగాలను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి గ్రనేడ్ ను స్వాధీనం చేసుకున్నారు.