Students Romance : ఛీ..ఛీ.. కాలేజీలోనే లవర్స్ పాడు పని, అంతా చూస్తుండగానే.. వీడియో వైరల్
కామంతో రగిలిపోతూ ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. పబ్లిక్ గానే రొమాన్స్ చేసుకుంటున్నారు.. Students Romance

Students Romance(Photo : Google)
Students Romance In College : లవర్స్ రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దిగజారిపోతున్నారు. వీధుల్లోనే కాదు దేవాలయంలా పవిత్రంగా భావించే కాలేజీలోనూ బరితెగిస్తున్నారు. బుద్ధిగా చదువుకోవాల్సిన కుర్రాళ్లు పాడు పనులు చేస్తున్నారు. మనం ఎక్కడ ఉన్నాం? ఏం చేస్తున్నా? అనే స్పృహ లేకుండా పోతోంది. కామంతో రగిలిపోతూ ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. పబ్లిక్ గానే రొమాన్స్ చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇద్దరు లవర్స్ రెచ్చిపోయారు. రొమాన్స్ లో మునిగి తేలారు.
అది షాజహాన్ పూర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. ఓ హాల్ లో కొందరు విద్యార్థులు కూర్చుని ఉన్నారు. ఓ అమ్మాయి పక్కనే అబ్బాయి ఉన్నాడు. అంతే, ఆ అబ్బాయికి మూడ్ వచ్చిందో ఏమో కానీ, అది కాలేజీ అన్న సంగతి కూడా మర్చిపోయాడు. సరసానికి దిగాడు. అమ్మాయికి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. అమ్మాయి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా అతడు మాత్రం తగ్గేదేలే అంటూ రెచ్చిపోయాడు. ముద్దుల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఆమెపై చేతులు వేశాడు. అబ్బాయి చర్యతో అమ్మాయి కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ, ఆ అబ్బాయి నుంచి దూరంగా మాత్రం జరగలేదు. వారించే ప్రయత్నమూ చేయలేదు.
అమ్మాయికి అబ్బాయి ముద్దులు పెడుతుండగా అక్కడే ఉన్న మరో విద్యార్థి వీడియో తీశాడు. అంతే, ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక్కసారిగా కాలేజీలో దుమారం రేగింది. కాలేజీ గదిలో ఇదేం పాడుపని అంతా మండిపడుతున్నారు. బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా ముద్దుల్లో మునిగి తేలడం ఏంటని? సీరియస్ అవుతున్నారు. అదే కాలేజీ అనుకున్నారా? మీ బెడ్ రూమ్ అనుకున్నారా? అని తిట్టిపోస్తున్నారు. మీరు కాలేజీకి వెళ్లేది చదువుకోవడానికి, ముద్దుల్లో మునిగితేలడానికా? అని కసురుకుంటున్నారు.
Also Read..Delhi : షాకింగ్ వీడియో.. మహిళా పైలట్, ఆమె భర్తను దారుణంగా కొట్టిన జనం
వీడియో నెట్టింట్ వైరల్ కావడం, తీవ్ర విమర్శలు రావడంతో ఈ వ్యవహారంపై కాలేజీ ప్రిన్సిపాల్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాఫ్తునకు ఆయన ఆదేశించారు. ఆ ఇద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని, దీన్ని వదిలే ప్రసక్తే లేదని, ఆ ఇద్దరిపై యాక్షన్ తీసుకుంటామని ప్రిన్సిపాల్ తేల్చి చెప్పారు. కాలేజీలో చదువుకి తప్ప మరో వ్యవహారానికి తావు లేదన్నారు.
కాలేజీలోనే సరసాలు..
#शाहजहांपुर: #राजकीय_मेडिकल_कॉलेज में हो रही इश्क की पढ़ाई
शर्मनाक हरकतों का वीडियो सोशल मीडिया पर #वायरल,@satyamevnewstv नहीं करता है वायरल वीडियो की #पुष्टि#Viral_Video#Shahjahanpur@PintuZee@ankitnews12@brajeshpathakup pic.twitter.com/yDFQYvykIY
— Satyamev News (@satyamevnewstv) July 23, 2023