Strange Toilet: బాబోయ్.. ఇలాకూడా ఆలోచిస్తారా..! కంగుతిన్న అధికారులు..

ఉత్తర ప్రదేశ్‌లోని గౌరధుందా గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసినవారంతా ‘బాబోయ్.. ఎవడ్రా ఈ ఐడియా ఇచ్చింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్థానికంగా ఈ టాయిలెట్ నిర్మాణం చర్చనీయాంశంగా మారింది.

Strange Toilet: బాబోయ్.. ఇలాకూడా ఆలోచిస్తారా..! కంగుతిన్న అధికారులు..

Strange Toilet

Updated On : December 22, 2022 / 12:50 PM IST

Strange Toilet: ఉత్తర ప్రదేశ్‌లోని గౌరధుందా గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసినవారంతా ‘బాబోయ్.. ఎవడ్రా ఈ ఐడియా ఇచ్చింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్థానికంగా ఈ టాయిలెట్ చర్చనీయాంశంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఒకే టాయిలెట్‌ రూంలో రెండు టాయిలెట్ సీట్లు అమర్చారు. అదికూడా, ఆ రెండింటిని పక్కపక్కనే ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా ఈ మరుగుదొడ్డిని పరిశీలించిన పంచాయతీ అధికారులు కంగుతిన్నారు. ఎవర్రా ఇలా చేసింది అంటూ కంగారుగా అడిగేశారు. ఇంత చెత్త ఆలోచన చేసిన స్థానిక సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.

Viral News: మూడేళ్లుగా మూల గదిలోనే.. తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లోని టౌన్‌షిప్‌లో ప్రధాన కార్యాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో గౌరధుందా గ్రామం ఉంది. గ్రామంలో కార్యదర్శి, ప్రధాన్‌లు రూ. 10లక్షల వ్యయంతో కమ్యూనిటీ మరుగుదొడ్లను నిర్మించారు. అయితే, నేటికీ వాటిని ఎవరూ వినియోగించుకోలేదు. మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటికి తలుపులు ఏర్పాటు చేయలేదు. ఇదీకాక, ఒకే మరుగుదొడ్డిలో రెండు టాయిలెట్ సీట్లను అమర్చారు.

VIral News: బావిలో పడ్డా.. ప్రియురాలు దక్కింది..! అదృష్టమంటే వీడిదేకాబోలు..

ఈ విషయంపై జిల్లా పంచాయతీరాజ్ అధికారి నమ్రతా శరణ్ మాట్లాడుతూ.. ఇలా చెత్త ఐడియాతో టాయిలెట్ నిర్మించిన అధికారులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమ్యూనిటీ టాయిలెట్ త్వరగా సరిచేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని నమ్రతా శరణ్ పేర్కొన్నారు.