ఓటు కోసం క్యూలో : పోలింగ్‌లో ఇద్దరు ఓటర్లు మృతి
తమిళనాడులో ఓటు వేసేందుకు వెళ్లిన ఇద్దరు ఓటర్లు మృతిచెందారు. ఈ ఘటన ఎరోడ్, సాలెం లోక్ సభ నియోజవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరిగింది.

తమిళనాడులో ఓటు వేసేందుకు వెళ్లిన ఇద్దరు ఓటర్లు మృతిచెందారు. ఈ ఘటన ఎరోడ్, సాలెం లోక్ సభ నియోజవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరిగింది.
తమిళనాడులో ఓటు వేసేందుకు వెళ్లిన ఇద్దరు ఓటర్లు మృతిచెందారు. ఈ ఘటన ఎరోడ్, సాలెం లోక్ సభ నియోజవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరిగింది. గురువారం (ఏప్రిల్ 18, 2019) ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లిన ముర్గేసన్ (63), క్రిష్ణన్ (75) క్యూలో నిలబడ్డారు.
శివగిరి పోలింగ్ స్టేషన్ దగ్గర క్యూలో ముర్గేసన్ నిలబడ్డాడు. అప్పటికే ఆ క్యూలో 100 మంది ఓటర్లు ఉన్నారు. ఒకవైపు ఎండ తీవ్రత, గంటల కొద్ది క్యూలో నిలబడటంతో అతడు కొంచెం అస్వస్థతకు గురయ్యాడు.
అప్రమత్తమైన వైద్య అధికారులు ముర్గేసన్ కు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సమీప ఎరోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే ముర్గేసన్ మృతిచెందినట్టు నిర్ధారించారు.
మరోవైపు ఒమలూర్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటు వేసేందుకు వెళ్లిన క్రిష్ణన్ కూడా మృతిచెందాడు. క్యూలో నిలబడిన ఇద్దరు ఓటర్లు గుండెనొప్పితోనే మృతిచెంది ఉండొచ్చునని వైద్య అధికారులు చెబుతున్నారు. శివగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టారు.