పజిల్ : ఈ ఫొటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయి

ఈ ఫొటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయి ? అంటూ పజిల్ విసిరారు అటవీ శాఖ అధికారి సుసాంట నంద. ఈయన సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. పలు విషయాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తుంటారు. అటవీ శాఖకు సంబంధించిన వాటిని ఈయన పోస్టు చేస్తుంటారు. వినూత్నంగా ఉండే..ఫొటోలు, వీడియోలకు నెటిజన్లకు ఫిదా అవుతుంటారు. ఆయన పోస్టు చేసేవి అంత విభిన్నంగా ఉంటాయి కనుక. తాజాగా 2020, మార్చి 11వ తేదీ ఓ ఫొటో పోస్టు చేశారు. అందులో ఎడమ పక్కన ఓ చిరుత పులి ఉంది. ఎడమ పక్కన చెట్లు, గడ్డితో కూడిన ఫొటో ఉంది.
Read More : కరోనా ఫీవర్ : బెంగళూరు ఇన్ఫోసిస్ IIPM ఆఫీసు ఖాళీ
ఎడమ వైపు ఓ పులిని చూస్తున్నారు..అదే విధంగా కుడివైపు ఫొటోలో ఎన్ని పులులున్నాయో కనిపెట్టగలరా అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇది కేవలం ఛాలెంజ్ మాత్రమే కాదు..తమను తాము రక్షించుకొనేందుకు పులి చర్మపు రంగులు దానికి ఏ విధంగా ఉపయోగపడుతాయో చెప్పే ప్రయత్నమన్నారు ఆయన. అయితే..దీనిపై తర్వాత పూర్తిగా వివరిస్తానని, ఇప్పటికైతే ఈ ఫొటోలో ఉన్న పులులను గుర్తించాలంటూ నెటిజన్లకు పజిల్ విసిరారు.
Also Read | ఆయన్ని ఒక్కసారి కలవాలనుంది… మీరా మిథున్
చాలా మంది నెటిజన్లు స్పందించారు. చాలా కష్టంగా ఉంది సార్ అని ఒకరు..గడ్డిలో పులుల జాడ కనుక్కోవడం సవాల్ లాంటిది..అంటూ మరొకరు..ఇలా కామెంట్స్ చేశారు. ఎవరికి తోచిన విధంగా వారు స్పందన తెలియచేస్తున్నారు. మరి..సుసాంట షేర్ చేసిన ఫొటోను చూసి..పజిల్‌ను చేధించండి.
Camouflaging & misdirection explained best. U can see one tiger in the left. Can you find out how many are there in the right picture? pic.twitter.com/zSvvjwAjvX
— Susanta Nanda IFS (@susantananda3) March 11, 2020