సీఎం పదవికి ఉద్దవ్ రాజీనామా?

  • Published By: venkaiahnaidu ,Published On : January 13, 2020 / 09:48 AM IST
సీఎం పదవికి ఉద్దవ్ రాజీనామా?

Updated On : January 13, 2020 / 9:48 AM IST

మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ యశ్వంత్ రావ్ గఢఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్,ఎన్సీపీలను ఈ సందర్భంగా యశ్వంత్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన మంత్రిపదవుల కేటాయింపై కాంగ్రెస్,ఎన్సీపీలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో…సరిగ్గా నడుచుకోండి లేదంటే ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారంటూ యశ్వంత్ రెండు పార్టీలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.

మూడుసార్లు అహ్మద్ నగర్ స్థానానికి  కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన యశ్వంత్ రావ్…ఉద్దవ్ ఠాక్రే రెగ్యులర్ పొలిటీషియన్ కాదని,ఆయనకు ఆర్టిస్ మెంటాలిటీ ఉందని అన్నారు. మహావికాస్ అఘాడి ప్రభుత్వంలోని భాగస్వాములైన కాంగ్రెస్,ఎన్సీపీ నాయకులు పదవుల కేటాయింపై కంప్లెయిట్ లు చేయడం మానుకోవాలన్నారు.

ఇటీవల ఉద్దవ్ ఠాక్రే చేపట్టిన కేబినెట్ విస్తరణ పట్ట పలువురు కాంగ్రెస్,ఎన్సీపీ,శివసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేబినెట్ పదవులు,శాఖల కేటాయింపు విషయంలో మూడు పార్టీల్లోని  నాయకుల మధ్య అసంతృప్తి నెలకొంది. పలువురు అయితే ఏకంగా పార్టీ పదవులకు,ఓ ఎమ్మెల్యే కూడా అసంతృప్తితో రాజీనామా చేశారు. ఈ సమయంలో బీజేపీ కూడా శివసేనపై విమర్శలు ఎక్కుపెడుతోంది. చాలా మంది నాయకులు మహావికాస్ అఘాడి ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని,త్వరలోనే ప్రభుత్వం పడిపోతుందని ఉద్దవ్ ప్రభుత్వంపై కాషాయ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. మహావికాస్ అఘాడి ప్రభుత్వ పతనం ప్రారంభమైందని ఇటీవల ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.