Uddhav Thackeray : యోగి ఆదిత్యనాధ్ పై అనుచిత వ్యాఖ్యలు..మహా సీఎంపై బీజేపీ కంప్లెయింట్

మహారాష్ట్ర సీఎంపై ఉద్ధవ్ ఠాక్రేపై సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయ‌ణ రాణేని మహారాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడం

Uddhav Thackeray : యోగి ఆదిత్యనాధ్ పై అనుచిత వ్యాఖ్యలు..మహా సీఎంపై బీజేపీ కంప్లెయింట్

Uddav Yogi

Updated On : August 25, 2021 / 9:38 PM IST

Uddhav Thackeray  మహారాష్ట్ర సీఎంపై ఉద్ధవ్ ఠాక్రేపై సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయ‌ణ రాణేని మహారాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడం.. రాయ్‌గఢ్‌లోని మహద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అర్ధరాత్రి కేంద్రమంత్రికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

అయితే కేంద్రమంత్రి అరెస్ట్ పై రాజకీయ బీజేపీ-శివసేన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్ వేళ ఉద్ధవ్ ఠాక్రే 2018లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఓ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యోగి పాల్ఘ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హానికి పూల‌మాల వేస్తున్న స‌మ‌యంలో చెప్పులు ధ‌రించార‌ని, దీంతో అదే చెప్పుల‌తో ఆయ‌న‌ను కొట్టాల‌ని అనిపించింద‌ని ఠాక్రే అన‌డం ఈ వీడియోలో క‌నిపించింది. ఆయ‌న యోగి అయితే సీఎం ఎలా అవుతార‌ని, యోగి అన్నీ త్య‌జించి గుహ‌లో కూర్చోవాల‌ని..సీఎం కుర్చీలో కూర్చుని త‌న‌ను తాను యోగి అని చెప్పుకుంటున్నార‌ని ఈ వీడియోలో ఉద్థవ్ ఠాక్రే అంటున్నట్లు కనిపిస్తోంది.

దీంతో యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌పై గ‌తంలో అభ్యంత‌ర‌క‌ర‌ వ్యాఖ్య‌లు చేసిన ఠాక్రేపై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని బీజేపీ నేత‌లు తాజాగా పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఠాక్రేపై నాసిక్‌లోని స‌ర్కార్‌వాడ పోలీస్ స్టేష‌న్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ యావ‌త్మాల్ జిల్లా అధ్యకుడు కూడా ఠాక్రే వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

READ Union Minister Arrested :సీఎం ఉద్ధవ్ పై అనుచిత వ్యాఖ్యలు..కేంద్రమంత్రి అరెస్ట్