మహాత్మాగాంధీ జ్ఞాపకార్థం నాణెంను పరిశీలిస్తున్న UK

  • Published By: madhu ,Published On : August 2, 2020 / 12:10 PM IST
మహాత్మాగాంధీ జ్ఞాపకార్థం నాణెంను పరిశీలిస్తున్న UK

Updated On : August 2, 2020 / 12:35 PM IST

భారత జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం ఓ నాణెంను ముద్రించేందుకు బ్రిటన్ పరిశీలిస్తోంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి (British Finance Minister) రిషి సునాక్ రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ (ఆర్ఎంఐసీ) Royal Mint Advisory Committee (RMAC)కి సూచించారు.



నల్లజాతి, ఆసియ, ఇతర మైనార్టీ వర్గాలపై ఫోకస్ పెడుతుండడం విశేషం. RMAC ప్రస్తుతం ఒక నాణెంను పరిశీలిస్తోందని ట్రెజరీ వెల్లడించింది. 1869లో జన్మించిన గాంధీ..జీవితాంతం అహింస కోసం పోరాటం చేశారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

అక్టోబర్ 02వ తేదీ ఆయన జన్మదినం. ఈ రోజున అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకే Father of the Nation గా పలవడే గాంధీ..1948, జనవరి 30వ తేదీన మరణించారు. అమెరికాలో మిన్నియాపొలీస్ నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయడ్ ను ఓ పోలీస్ అధికారి చేతిలో చనిపోయిన సంగతి తెలిసిందే.



దీనిపై జాత్సాహంకార దాడులకు వ్యతిరేకంగా భారీగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచం మొత్తం వణికిపోయింది. వలసవాదం, జాత్సహంకారం వంటి అంశాలపై బ్రిటీష్ సంస్థలు ఫోకస్ పెట్టాయి.