Unlock 4.0 Guidelines : 7 నుంచి మెట్రో… సెప్టెంబర్ 30వరకు విద్యా సంస్థలు బంద్

Unlock 4.0 Guidelines : ఆన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. దశలవారీగా మెట్రో సర్వీసులకు అనుమతించనున్నారు. సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతినిచ్చింది.
ఇక సెప్టెంబర్ 30 వరకు విద్యా సంస్థల బంద్ కొనసాగనున్నట్టు పేర్కొంది. కంటోన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.. స్పోర్ట్స్ ఎంటర్ టైన్మెంట్, కల్చరల్, రాజకీయ సమావేశాలకు అనుమతినిచ్చింది.
సమావేశాలకు 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని గైడ్ లైన్స్ లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్క్ లు మూసివేయనున్నారు. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని కేంద్రం సూచించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మెట్రో రైలు సర్వీసులకు అనుమతి లభించింది. కొన్ని నెలలుగా మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో భారీగా నష్టాల బాటపట్టింది. సామాజిక దూరంతో పాటు శానిటైజేషన్ చేస్తూ మెట్రో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్టు సర్వీసులకు అనుమతి లేదు.
మెట్రో రైళ్లకు అనుమతి రావడంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా మెట్రో సర్వీసులను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇతర పబ్లిక్ ట్రాన్స్ ఫోర్టులు ప్రారంభమయ్యేవరకు మెట్రోల్లో రద్దీ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.