నేడే ఆఖరి రోజు.. కలకలం రేపిన పార్శిల్

  • Published By: murthy ,Published On : November 13, 2020 / 02:05 PM IST
నేడే ఆఖరి రోజు.. కలకలం రేపిన పార్శిల్

Updated On : November 13, 2020 / 2:11 PM IST

unmarked parcel thretened…alert collector office staff : తమిళనాడులోని తేని జిల్లా, కలెక్టర్ ఆఫీసులో చెట్టుకు కట్టిన పార్సిల్ కలకలం రేపింది. శుక్రవారం  ఉదయం తేని జిల్లా కలెక్టర్ ఆఫీసులోని చెట్టుకు ఒక పార్శిల్ వేలాడ దీసి ఉండటం కొందరు గమనించారు. అది చూసి వారు కంగారు పడ్డారు. ఒక అట్టపెట్టెను టవల్ లో చుట్టి… దానిపై తెల్ల కాగితం పెట్టి దాన్ని చెట్టుకు వేలాడ దీశారు.



ఆ కాగితంపై నేడే ఆఖరి రోజు అని రాసి ఉంది. ఆ వ్యాఖ్య చుట్టూ స్టార్ గుర్తులు వేసి ఉన్నాయి. దీంతో హడలిపోయిన ప్రజలు ఆపార్శిల్ లో బాంబు ఉందని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్ తో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన పోలీసులు పార్శిల్ ను తీసి చూడగా….. అది ఖాళీ అట్టపెట్టె అని తేలింది. దాంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

కాగా…. శుక్రవారం ఉదయం ఒక మతిస్ధిమితం లేని వ్యక్తి కార్యాలయంలో సంచరించాడని…. అతనే ఆ పార్శిల్ అక్కడ చెట్టుకు కట్టి ఉంటాడని భావిస్తున్నారు.