UP Assembly Elections : యూపీలో కుంట నుంచి ఏడోసారి.. ఎవరీ రాజా భయ్యా.. ఆయన పొలిటికల్ జెర్నీ గురించి 5 విషయాలు ఇవే..!

UP Assembly Elections : యూపీలో కుంట నియోజకవర్గం.. ఇది రాజా భయ్యా అడ్డా.. ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఎవరూ గెలవలేదు. వరుసగా ఏడుసార్లు కుంట నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

UP Assembly Elections : యూపీలో కుంట నుంచి ఏడోసారి.. ఎవరీ రాజా భయ్యా.. ఆయన పొలిటికల్ జెర్నీ గురించి 5 విషయాలు ఇవే..!

Up Assembly Elections Raja Bhaiya Wins From Up's Kunda For 7th Time 5 Things To Know About Him

Updated On : March 10, 2022 / 7:39 PM IST

UP Assembly Elections : యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. అత్యధిక మెజార్టీతో యూపీలో బీజేపీ విజయదుందుభి మోగించింది. యూపీలో ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తూ భారీ విజయాన్ని అందుకుంది బీజేపీ. బీజేపీ పాగా వేసిన అన్ని స్థానాల్లో దాదాపు విజయాన్ని అందుకుంది. యూపీలో ఆ ఒక్క స్థానం మినహా.. అదే.. కుంట నియోజకవర్గం.. ఈ కుంట.. రాజా భయ్యా అడ్డా.. ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఎవరూ గెలవలేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వరుసగా ఏడుసార్లు కుంట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కుంట నియోజకవర్గ ప్రజలు రాజా భయ్యా అని ముద్దుగా పిలుచుకునే ఈ ఎమ్మెల్యే అసలు పేరు.. రఘురాజ్ ప్రతాప్ సింగ్.. అలియాస్ రాజా భయ్యాగా పేరొందారు.

జనసత్తా దళ్ (Loktantrik) పార్టీకి అధినేత కూడా.. రఘురాజ్ ప్రతాప్ సింగ్ యూపీలోని కుంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గుల్షన్ యాదవ్‌పై దాదాపు 27,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ ఈ స్థానం నుంచి సింధూజా మిశ్రాను బరిలోకి దింపింది. కానీ, రాజా భయ్యాకే ఈ కుంట నియోజకవర్గ ప్రజలు జై కొట్టారు. అంతగా ఆయన ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. రాజా భయ్యా రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది.. ఆయన పొలిటికల్ జెర్నీ కుంట నియోజవర్గం వరకు ఎలా సాగింది. నియోజకవర్గ ప్రజలంతా ఆయన్నే ప్రతిసారి ఎందుకు గెలిపిస్తున్నారు.. రాజా భయ్యా గురించి తెలుసుకోవాల్సిన ఈ 5 ఐదు అంశాలను ఓసారి లుక్కేయండి..

Up Assembly Elections Raja Bhaiya Wins From Up's Kunda For 7th Time 5 Things To Know About Him (1)

Up Assembly Elections : Raja Bhaiya Wins From Up’s Kunda For 7th Time 5 Things To Know About Him

UP Assembly Elections : రాజా భయ్యా పొలిటికల్ జెర్నీ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే : 

1. రాజా భయ్యాకు మొత్తం 76,620 ఓట్లు వచ్చాయి. గుల్షన్ యాదవ్‌కు 49,867 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గం నుంచి రాజా భయ్యాకు ఇది వరుసగా ఏడో విజయం.

2. 1993లో ఇండిపెండెంట్‌గా మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేశాడు. అప్పటి నుంచి రాజా భయ్యా వరుసగా 6 ఎన్నికల్లో కుంట నుండి పోటీ చేసి విజయం సాధించాడు. రాజా భయ్యా 2018లో సొంత పార్టీని స్థాపించారు. కుంట నియోజకవర్గంలో ఫిబ్రవరి 27న ఐదో దశలో ఎన్నికలు జరిగాయి.

3. 2017లో రాజా భయ్యా.. బీజేపీకి చెందిన జాంకీ శరణ్‌ను రికార్డు స్థాయిలో 1,03,647 ఓట్ల తేడాతో ఓడించారు. ఎన్నికలకు ముందు.. 2017లోనూ కుంట నియోజకవర్గంలో తానే గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్నట్టుగానే మరోసారి కుంట నుంచి గెలుపొందారు.

4. 52 ఏళ్ల రాజా భయ్యా.. గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అయితే ఆయనపై అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. వివాదాస్పద నేత, రాజా భయ్యా యూపీలో కండలవీరుడుగా పేరుగాంచాడు. కళ్యాణ్ సింగ్, రాంప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వాలలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.

5 . రాజా భయ్యా ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల ప్రకారం.. ఆయన మొత్తం నికర విలువ రూ. 23.70 కోట్లు.

Read Also : UP Results : మోదీ-యోగీ మ్యాజిక్ రిపీట్..? యూపీలో బీజేపీ గెలిస్తే మరో చరిత్రే!