Uttar Pradesh CM Yogi : పండుగలకు సీఎం యోగి కొత్త మార్గదర్శకాలు జారీ

బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. రోడ్డు భద్రతలను పాటించాలి. రోడ్డు భద్రత అమలు విషయంలో సంబంధిత మత పెద్దలతోను, విద్యావేత్తలతోను స్థానిక అధికారులు సంప్రదించాలి.

Uttar Pradesh CM Yogi : పండుగలకు సీఎం యోగి కొత్త మార్గదర్శకాలు జారీ

Uttar Pradesh CM Yogi

Updated On : June 28, 2023 / 4:17 PM IST

Uttar Pradesh CM Yogi : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం (Yogi Adityanath Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ (festivals)లకు సంబందించి కొత్త మార్గదర్శకాలు (guidelines )జారీ చేసింది. పండుగల సమయాల్లో భక్తుల అనుసరించాల్సిన విధానాలు, నిబంధనలను ఆదేశించింది. దీంట్లో భాగంగా శాంతి భద్రతలను కాపాడేవిధంగా పండుగలు జరుపుకోవాలని సూచించింది. రేపు బక్రీద్ (Bakrid) పండుగ ఆ తరువాత వచ్చే శ్రావణి శివరాత్రి (Shravani Shivaratri), నాగ పంచమి (Nagapanchami), రక్షా బంధన్ (Rakshabandhan), మోహ్రం (Muharram)వంటి పండుగలు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనల ప్రకారం చేసుకోవాలని సూచించింది. భక్తులు అనుసరించాల్సిన నిబంధనలు జారీ చేస్తు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అన్ని మతాల వారికి కొన్ని షరతులు విధించింది.

నిబంధనలతో పాటు అన్ని రకాల మతాలకు సంబంధించి భక్తులకు, విశ్వాసులకు అందజేయాల్సిన సదుపాయాలను, భద్రతా చర్యలపై సీఎం యోగీ ఆదిత్యనాధ్ సమీక్ష జరిపారు. అనంతరం ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనలను, సదుపాయాలను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ మతం వారైనా శాంతిభద్రతలను కాపాడేవిధంగా ఈ పండుగలను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

Rahul Gandhi: బైక్ మెకానిక్‌లా మారిన రాహుల్ గాంధీ .. సుమారు గంటన్నర పాటు కరోల్‌బాగ్‌లోనే.. ఫొటోలు వైరల్

బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలని.. రోడ్డు భద్రతలను పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత అమలు విషయంలో సంబంధిత మత పెద్దలతోను, విద్యావేత్తలతోను స్థానిక అధికారులు సంప్రదించాలని ఆదేశించారు. వారితో అన్ని అంశాలు చర్చించి సరైన విధానాలు పాటించాలని ఆదేశించారు.

మరి ముఖ్యంగా రేపు బక్రీదు పండుగ కావటంతో ఆయా వివాదాస్పద స్థలాల్లో బక్రీద్ పండుగ పురస్కరించుకుని పశువులను బలి ఇవ్వటాన్ని నిషేధించారు. నిర్ణయించే ప్రదేశాల్లోనే ఈ కార్యక్రమాలు చేసుకోవాలని మరి ముఖ్యంగా బలి ఇచ్చే ప్రదేశాన్ని ముందుగానే నిర్ణయించుకుని అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ముందుగా తెలియజేసిన ప్రదేశాల్లోనే బలులు అర్పించుకోవాలని అలాకాకుండా ఇతర ప్రాంతాల్లో చేయకూడదని స్పష్టంచేశారు.

Ravi Kishan Daughter: అగ్నిపథ్ పథకం కింద డిఫెన్స్ ఫోర్స్‌లో చేరిన బీజేపీ ఎంపీ కుమార్తె ఇషితా శుక్లా

కన్వర్ యాత్ర సంప్రదాయబద్దంగా జరుపుకోవాలని అందరు సురక్షితంగా ఉండాలని దానికి తగిన సూచనలు పాటించాలన్నారు. ఈ యాత్రలు జరిగే మార్గాల్లో మాంసం విక్రయించరాదని అలాగే మాంసపు ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు.