UP Crime: ఆపరేషన్ ‘బుల్డోజర్’ తో అత్యాచార నిందితుడిని పట్టుకున్న పోలీసులు

పోలీసులు ఆపరేషన్ ‘బుల్డోజర్’తో ఓ అత్యాచార నిందితుడికి పట్టుకున్నారు. అదెలాగంటే..

UP Crime: ఆపరేషన్ ‘బుల్డోజర్’ తో అత్యాచార నిందితుడిని పట్టుకున్న పోలీసులు

Policemen Park Bulldozer Near House Absconding Rapist Surrenders

Updated On : March 25, 2022 / 11:25 AM IST

Policemen park bulldozer near house absconding rapist surrenders : తాజాగా యూపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా ‘బుల్డోజర్‌ బీజేపీ ఐకాన్‌’గా మారిపోయింది. యోగీ ఆదిత్యానాథ్ కు ఓటు వేయకపోతే వారిని గుర్తించి వారి ఇంటిమీదకు బుల్డోజర్లను పంపిస్తాం అంటూ ఇచ్చిన వార్నింగ్ లతో బుల్డోజర్ అనేది బీజేపీ ఐకాన్ గా మారిపోయింది. ఈ క్రమంలో యూపీలో బుల్డోజర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. యూపీలో ఓ అత్యాచార నిందితుడికి పట్టుకోవటానికి పోలీసులు బుల్డోజర్ ను ఉపయోగించారు. దీంతో దెబ్బది దిగొచ్చి పోలీసులకు లొంగిపోయాడు సదరు అత్యాచార నిందితుడు..! అసలు విషయం ఏంటంటే..

ప్రయాగ్‌రాజ్‌లో ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిపై ఫిర్యాదు చేయగా సదరు నిందితుడిని పట్టుకోవటానికి పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు.ఎంతకు చిక్కటంలేదు. దీంతో పోలీసులు ‘బుల్డోజర్’ప్లాన్ వేశారు.

ఆదివారం (మార్చి20,2022) సాయంత్రం ఓ బుల్డోజర్‌తో అత్యాచార నిందితుడి ఇంటికి చేరుకున్నారు. అతని ఇంటి ప్రహరీని కూలగొట్టారు. తరువాత ఎనౌన్స్ చేశారు. ఇప్పటికైనా లొంగిపోకపోతే..ఇల్లు మొత్తం కూల్చేస్తాం అని వార్నింగ్ ఇచ్చి బుల్డోజర్ ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. అంతే దెబ్బకు దిగొచ్చాడు అత్యాచార నిందితుడు. పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అక్రమ కట్టడాలను కూల్చడానికే కాదు.. నేరస్థులను పట్టుకోవటానికి కూడా బీజేపీ ఐకాన్ బుల్డోజర్ బాగానే ఉంది అంటున్నారు జనాలు.