Sanjay Nishad: నాకన్నా పెద్ద లీడర్ అయితే అరవండంటూ మైక్ విసిరి కొట్టిన యూపీ మంత్రి
సంజయ్ నిషాద్ మైక్ విసిరి కొట్టి ‘‘ఎంత పెద్ద వ్యక్తి అతడు? ఇతరులలాగే మీరు కూడా ప్రవర్తిస్తున్నారా? అయితే మీరు ధ్వంసమైపోతారు జాగ్రత్త’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లడుతూ ‘‘నేను స్టేజీపై ఉండి మాట్లాడుతున్నప్పుడు మీకు వినాలనిపిస్తే వినండి. లేదంటే లేదు. అంతేకానీ ఇలాంటి నినాదాలు ఎందుకు చేస్తున్నారు? ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?’’ అంటూ ఆయన ప్రజలపై మండిపడ్డారు.

UP minister loses cool, throws down mic on stage
Sanjay Nishad: తమకు తగిన మర్యాద దక్కకుంటే ఎంత పెద్ద నాయకులైనా నిండు సభలోనే అలకపూనడం, కోపానికి రావడం సహజం. ఇలా అలకపూనిన సమయంలో కొందరు అరుస్తారు, కొందరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. నిషాద్ పార్టీ అధినేత, యూపీ మంత్రి సంజయ్ నిషాద్ ఒక్కసారిగా కోపానికి వచ్చారు. సభికులు వేరే నేతను పొగుడుతూ నినాదాలు చేస్తుంటే, ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. అంతే, తనకన్నా పెద్ద లీడర్ అయితే అరవండి అంటూ మైక్ విసిరి కొట్టారు.
అక్కడున్నవారు వెంటనే తేరుకుని అరుస్తున్న జనాన్ని కాస్త శాంతించమంటూ బతిమాలి, ఆయనను శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు. ప్రజలు నినాదాలు ఆపివేయడంతో మంత్రి సంజయ్ నిషాద్ సైతం తన కోపాన్ని తగ్గించుకుని సభను కొనసాగించారు. శనివారం మౌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ దృశ్యం జరిగింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
వీడియో ప్రకారం.. సంజయ్ నిషాద్ మైక్ విసిరి కొట్టి ‘‘ఎంత పెద్ద వ్యక్తి అతడు? ఇతరులలాగే మీరు కూడా ప్రవర్తిస్తున్నారా? అయితే మీరు ధ్వంసమైపోతారు జాగ్రత్త’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లడుతూ ‘‘నేను స్టేజీపై ఉండి మాట్లాడుతున్నప్పుడు మీకు వినాలనిపిస్తే వినండి. లేదంటే లేదు. అంతేకానీ ఇలాంటి నినాదాలు ఎందుకు చేస్తున్నారు? ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?’’ అంటూ ఆయన ప్రజలపై మండిపడ్డారు.