Prophet Row: శుక్రవారం ప్రార్థనలకు ముందు మతగురువులను కలిసిన పోలీసులు

శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎటువంటి ఆందోళనలు కలగకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం జరిగినట్లుగా హింస, ఆందోళనలకు దారి తీయకుండా ముందుగా మత గురువులను కలిశారు.

Prophet Row: శుక్రవారం ప్రార్థనలకు ముందు మతగురువులను కలిసిన పోలీసులు

Uttar Pradesh (2)

Updated On : June 17, 2022 / 7:50 AM IST

 

Prophet Row: శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎటువంటి ఆందోళనలు కలగకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం జరిగినట్లుగా హింస, ఆందోళనలకు దారి తీయకుండా ముందుగా మత గురువులను కలిశారు. ఇప్పటికే ప్రవక్తపై అనుచిత కామెంట్లు చేసిన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మను సస్పెండ్ చేసింది ఆ పార్టీ.

ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వఖ్ఫ్ బోర్డ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లను అనుమతించొద్దని మసీదు మేనేజ్మెంట్లను కోరింది. ఈ క్రమంలో జూన్ 10న జరిగిన ఆందోళనల్లో పోలీసులు దాదాపు 400మందిని అరెస్ట్ చేశారు. ప్రయాగ్ రాజ్, సహరాన్పూర్, హత్రాస్, అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల వ్యక్తులు పోలీసులు అదుపులో ఉన్నారు.

“శుక్రవారం ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. మతగురువులతో సమావేశం అయ్యాం. జిల్లాల్లోని సివిల్ సొసైటీ, పీస్ కమిటీలతో మాట్లాడాం. రేంజ్, జోన్ పరిధుల్లో ఉన్న సీనియర్ అధికారులే చర్చల్లో పాల్గొన్నారు” అని అడిషనల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.

Read Also: ప్రవక్తపై కామెంట్ల తర్వాత బీజేపీలో కొత్త రూల్స్

డిఫెన్స్ వారితో పాటు డిజిటల్ వాలంటీర్స్ సాయం తీసుకుని రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గతవారం ఉత్తరప్రదేశ్ వీధుల్లో భారీ సంఖ్యలో పాదయాత్ర చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

జూన్ 10న జరిగిన వయొలెన్స్ దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఆందోళనలు జరపొద్దని యూపీ షియా సెంట్రల్ వఖ్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అలీ జైదీ మసీదు మేనేజ్మెంట్లకు సూచనలు ఇచ్చారు.