Helicopter On Road : ఇది రోడ్డుపై నడిచే హెలికాప్టర్‌..ధర రూ.3లక్షలే..!

హెలీకాప్టర్ అంటే గాల్లో ఎగురుతుంది.కానీ ఓ యువకుడు తయారు చేసిన హెలికాప్టర్ మాత్రం రోడ్డుమీదే నడుస్తుంది. ఏంటీ షాక్ అయ్యారా? అదే మరి దసరు యువకుడి టాలెంట్. ఓ యువ కార్పెంటర్‌ కళానైపుణ్యంతో నానో కారును ఏకంగా హెలికాప్టర్‌గా మార్చేశాడు. ఈ హెలికాప్టర్‌ రోడ్డుపై నడుస్తుంది కానీ ఈ కారులో ప్రయాణిస్తే మాత్రం అచ్చంగా హెలికాప్టర్ లో విహరిస్తున్నట్లే ఉంటుందంటున్నాడీ ఉత్తరప్రదేశ్‌ కు చెందిన కళాకారుడు.

Helicopter On Road : ఇది రోడ్డుపై నడిచే హెలికాప్టర్‌..ధర రూ.3లక్షలే..!

up carpenter nano car into helicopter

Updated On : December 22, 2022 / 10:47 AM IST

Nano Car Into A Helicopter : హెలీకాప్టర్ అంటే గాల్లో ఎగురుతుంది.కానీ ఓ యువకుడు తయారు చేసిన హెలికాప్టర్ మాత్రం రోడ్డుమీదే నడుస్తుంది. ఏంటీ షాక్ అయ్యారా? అదే మరి దసరు యువకుడి టాలెంట్. ఓ యువ కార్పెంటర్‌ కళానైపుణ్యంతో నానో కారును ఏకంగా హెలికాప్టర్‌గా మార్చేశాడు. ఈ హెలికాప్టర్‌ రోడ్డుపై నడుస్తుంది కానీ ఈ కారులో ప్రయాణిస్తే మాత్రం అచ్చంగా హెలికాప్టర్ లో విహరిస్తున్నట్లే ఉంటుందంటున్నాడీ ఉత్తరప్రదేశ్‌ కు చెందిన కళాకారుడు.

యూపీలోని అజంగఢ్‌కు చెందిన సల్మాన్‌ అనే యువకుడు కార్పెంటర్‌ పని చేస్తుంటాడు. అతనికి హెలికాప్టర్ అంటే ఎంతో ఇష్టం. కానీ ఎప్పుడు ఎక్కలేదు.కానీ హెలికాప్టర్ ఎక్కాలని కోరిక. ఆ కోరికను ఇలా నానో కారును హెలికాప్టర్‌గా మార్చేసి తీర్చేసుకున్నాడు. అతని ప్రతిభకు..వినూత్న ఆలోచనలకు నిదర్శనంగా నిలిచిన ఈ నానో హెలికాప్టర్ ను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈ నానో హెలికాప్టర్ తయారు చేయటానికి తనకు నాలుగు నెలలు పట్టిందని తెలిపాడు సల్మాన్‌. ‘నేను రోడ్డుపై నడిచే హెలికాప్టర్‌ను తయారు చేశాను. దీనికి చక్కటి డిమాండ్ కూడా వచ్చింది..దీంతో మరిన్ని హెలికాప్టర్లు తయారు చేస్తానని దీని ధర కేవలం రూ.3 లక్షలేనని తెలిపాడు. నేను డిజైన్ చేసిన ఈ హెలికాప్టర్‌ను చూడటానికి చాలామంది వస్తున్నారని అమ్ముతావా? అని అడుగుతున్నారని కొంతమంది అయితే ఇటువంటిదే తయారుచేయి మేం కొంటాం అని తెలిపారని చెప్పాడు సల్మాన్.

ఈ నానో హెలికాప్టర్ తో రోడ్డుపై వెళుతుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారని..భలే ఉందే డిజైన్ అంటున్నారని తెలిపాడు సల్మాన్. ఇది పేరుకు నానో కారే అయినా.. హెలికాప్టర్‌గా డిజైన్‌ చేసిన తర్వాత గాల్లో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తోందని సంబరంగా చెప్పాడు సల్మాన్‌ చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఆత్మవిశ్వాసం ఎంతగా ఉందంటే తనకు ప్రభుత్వం గానీ ఏ కంపెనీలైనా సహాయం చేస్తే నీరు, గాలితో నడిచే హెలికాప్టర్లను తయారుచేయగలనని ధీమాగా చెబుతున్నాడు.