ఘోర బస్సు ప్రమాదం.. నలుగురి మృతి.. 18 మందికి తీవ్రగాయాలు
సమాచారం అందగానే ఘటనాస్థలికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. పౌరీ జిల్లాలోని దహల్‌చోరి ప్రాంతం సమీపంలో బస్సు అదుపు తప్పి 100 మీటర్ల లోతైన లోయలో అది పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందగానే ఘటనాస్థలికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన సిబ్బంది అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ బస్సు పౌరీ నుంచి దహల్చోరీకి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వివరించారు.
పౌరి పోలీసులు, స్థానిక ప్రజలు అక్కడికక్కడే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. గాయపడ్డ 18 మందిని లోయ నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారని అన్నారు. మరో నలుగురి మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారని అన్నారు.
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
VIDEO | Uttarakhand: Five people feared dead as bus meets with an accident in Pauri. More details awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/F9RQzVuvpP
— Press Trust of India (@PTI_News) January 12, 2025
బీసీసీఐ కొత్త కార్యదర్శి దేవజిత్ సైకియాను కలిసిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు