ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ కి కరోనా
దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదువుతుండగా.. పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కోవిడ్-19 బారినపడ్డారు.

Uttarakhand Cm Tirath Singh Rawat Tests Covid 19 Positive
Uttarakhand CM దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదువుతుండగా.. పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కోవిడ్-19 బారినపడ్డారు. ఈ విషయాన్ని సోమవారం(మార్చి-22,2021)మధ్యాహ్నం సీఎం స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నానని సీఎం తెలిపారు. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కళ్లూ కోవిడ్ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని, వారందరూ స్వయంగా వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అని సీఎం ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా,ఇవాళ నాలుగు రోజుల పర్యటన కోసం సీఎం రావత్ ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం ఉత్తరఖాండ్ సీఎం ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా,ఇతర కేబినెట్ మంత్రులను కలవాల్సి ఉంది. ఆదివారం(మార్చి-21,2021)ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కరోనా వైరస్ కేసుల విషయమై కేంద్రం లేఖ రాసిన విషయం తెలిసిందే. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం గురించి ఉన్నత స్థాయి కేంద్ర బృందం లేవనెత్తిన ఆందోళనలను కేంద్రం ఆదివారం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. కుంభమేళాకు వచ్చిన యాత్రికులు, సిబ్బందిలో రోజూ 40 మందికిపైగా కోవిడ్ బారినపడుతున్నారని, టెస్టింగ్ సంఖ్యను పెంచాలని ఆ లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
హరిద్వారాల్ త్వరలో ప్రారంభం కానున్న కుంభమేళా కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైద్య మరియు ప్రజారోగ్య చర్యల గురించి సమీక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC)డైరక్టర్ నేతృత్వంలోని కేంద్ర బృందం మార్చి 16-17తేదీల్లో ఉత్తరాఖండ్ లో పర్యటించిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇక,ఉత్తరాఖండ్ లో ఇప్పటివరకు 98,448మంది కరోనాబారినపడ్డారు. 1704 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 861 యాక్టివ్ కేసులున్నాయి.