Uttarakhand : మదర్సాలలో ఇక నుంచి సంస్కృతం బోధన .. ప్రకటించిన వక్ఫ్ బోర్డు చైర్మన్
ఇక నుంచి దేవభూమి ఉత్తరాఖండ్ మదర్సాలలో అరబిక్ తో పాటు సంస్కృత భాష కూడా బోధించబడుతుంది.వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షామ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.

Sanskrit to taught in Uttarakhand madrasas
Sanskrit to be taught in Uttarakhand madrasasక : ఇకపై ఉత్తరాఖండ్ మదరసా(Uttarakhand Madrassas)లలో సంస్కృత (Sanskrit) భాష కూడా బోధించబడుతుంది అని రాష్ట్ర వక్ఫ్ బోర్డు (Waqf Board) చైర్మన్ షాదాబ్ షామ్స్ (chairman Shadab Shams)ప్రకటించారు. మదర్సాలలో ఎన్‌సీఈఆర్‌టీ ( NCERT)సిలబస్ అమలు చేస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షామ్స్ బుధవారం (సెప్టెంబర్ 13,2023)న ప్రకటించారు. దీంట్లో భాగంగా మదర్సాలలో సంస్కృత భాష కూడా బోధించనున్నామని తెలిపారు. ఎపిజె అబ్దుల్ కలాం వంటి స్పూర్తిదాయకమైన వ్యక్తుల అడుగుజాడల్లో పిల్లలు నడవడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. పిల్లలను చదివించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామి (CM Pushkar Singh Dhami)హామీ ఇచ్చారని షాదాబ్ షామ్స్ తెలిపారు.
మొత్తం 117 మదరసాలలో సంస్కృతంతో పాటు, ఇంగ్లీషు, అరబిక్ బోధిస్తామని..ఇస్లామిక్ అధ్యయనాల సమ్మేళనంగా ఉంటాయని తెలిపారు. ఈ విద్యావిధానం ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగూణంగా ఉంటుందని తెలిపారు. ఆధునిక విద్య అనేది ఈనాటి విద్యార్దులకు చాలా అవసరమన్నారు. ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునికత కలిగలిపిన విద్యను బోధిస్తామని తెలిపారు.
CM Stalin : సనాతన ధర్మంపై మాట్లాడటం మాని కేంద్ర వైఫల్యాలను ఎండగట్టండి : సీఎం స్టాలిన్ సూచన
ఇటువంటి విద్యతో మర్సాలలో చదువుకుంటున్న విద్యార్ధులకు చక్కటి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు మదర్సాలలో కేవలం ఇస్లామిక్, అరబిక్ మాత్రమే బోధించేవారని ఇక నుంచి సంస్కృత భాషను కూడా బోధిస్తామని తెలిపారు. కాగా మదర్సాలలో ఇస్లామిక్ కు చెందిన విషయాలనే బోధించేవారనే విషయం తెలిసిందే.
2022 నవంబరులో వక్ఫ్ బోర్డు పరిధిలోని అన్ని మదర్సాలు ఇతర పాఠశాలల మాదిరిగానే ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు క్లాసులు నిర్వహించేలా అలాగే ఒకే విధమైన దుస్తుల కోడ్ ఉంటుందని షామ్స్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని మదర్సాలను సర్వే చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని కూడా ఆయన చెప్పారు.
INDIA Alliance : ఆ టీవీ షోలు, ఆ యాంకర్లను బహిష్కరించాలని నిర్ణయించిన ఇండియా కూటమి
ఉత్తరాఖండ్ ను దేవభూమి అని అంటారు. అటువంటి దేవభూమిలో ప్రజలు ఇతరులకు భిన్నంగా ఉంటారని… మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఇతరులకు భిన్నంగా ఉంటే, మన విద్యా విధానం కూడా ఇతరులకు భిన్నంగా ఉండాలి. మన పిల్లలు మన భాషలను నేర్చుకుని దానికి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. మదర్సాలలో రెండు భాషలను బోధించేలా సంస్కృత బోధించేవారిని..అరబిక్ ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు.