Uttarakhand : కరోనా వేళ..బద్రినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి

లాక్ డౌన్ సమయంలో, నిబంధనలు ప్రజలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే..మంత్రి ధన్ సింగ్ రావత్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Uttarakhand : కరోనా వేళ..బద్రినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి

Badri Nath

Updated On : May 24, 2021 / 4:19 PM IST

Minister Visit Badrinath Temple : కరోనా ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దీనికి తోడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వైరస్ లు ప్రజలను కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ సమయంలో, నిబంధనలు ప్రజలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే..మంత్రి ధన్ సింగ్ రావత్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉత్తరాఖండ్ మంత్రి ధన్ సింగ్ రావత్..ఈయన లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ గవర్న మెంట్ చార్ ధామ్ యాత్రను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే..అనుచరులను వెంట పెట్టుకుని బద్రినాథ్ దర్శనానికి రావడం వివాదాస్పదమౌతోంది. ఆదివారం మంత్రి దర్శనానికి రావడం సరికాదని అక్కడి పూజారులు పేర్కొంటున్నట్లు సమాచారం. అనుచరుల బృందం, అధికారులు పోలీసులు రావడంతో ఆలయం రద్దీగా మారిపోయింది. మరి దీనిపై సదరు మంత్రి ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తారో చూడాలి.

Read More : MP Raghu Rama Krishna Raju : ఎంపీ రఘురామ విడుదల వాయిదా