Indian Navy Submarine: “యార్డ్ 11880” జలాంతర్గామిని ప్రారంభించిన భారత నేవీ

ప్రాజెక్ట్ 75లో భాగంగా కాల్వరి తరగతిలో ఆరు మరియు చివరి జలాంతర్గామి అయిన "యార్డ్ 11880" సబ్ మెరైన్ను బుధవారం ప్రారంభించారు.

Indian Navy Submarine: “యార్డ్ 11880” జలాంతర్గామిని ప్రారంభించిన భారత నేవీ

Vagsheer

Updated On : April 20, 2022 / 11:37 PM IST

Indian Navy Submarine: భారత నావికాదళంలో మరో కలికితురాయి చేరింది. ప్రాజెక్ట్ 75లో భాగంగా కాల్వరి తరగతిలో ఆరు మరియు చివరి జలాంతర్గామి అయిన “యార్డ్ 11880” సబ్ మెరైన్ను బుధవారం ప్రారంభించారు. ముంబైలోని మజాగాన్ డాక్ లిమిటెడ్ (MDL)కి చెందిన కన్హోజీ ఆంగ్రే వెట్ బేసిన్ వద్ద భారత నేవీ అధికారుల సమక్షంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రక్షణశాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా ఈకార్యక్రమానికి విచ్చేయగా..ఆయన సతీమణి శ్రీమతి వీణా అజయ్ కుమార్ జలాంతర్గామికి నామకరణం చేశారు. భారత నావికాదళ సాంప్రదాయం ప్రకారం ఒక మహిళ చేతులమీదుగా జలాంతర్గామిని ప్రారంభించడం లేదా నామకరణం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈక్రమంలోనే శ్రీమతి వీణా అజయ్ కుమార్ ఈ “యార్డ్ 11880” జలాంతర్గామికి “వాగ్‌షీర్”గా నామకరణం చేశారు.

Also read:Tirumala Temple: తిరుమల ఆలయానికి 10 ఎకరాలు స్థలం కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ప్రాజెక్ట్ 75లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ జలాంతర్గాములు మొదట 2017లో భారత నేవీలో చేర్చబడ్డాయి. ప్రస్తుతం ఇటువంటి నాలుగు జలాంతర్గాములు నేవీ ఆధ్వర్యంలో ఉండగా, ఐదో జలాంతర్గామి ఇంకా సముద్రంలో పలు పరీక్షలు ఎదుర్కొంటుంది. ఈ ఏడాది చివరికి ఐదో జలాంతర్గామి కూడా నేవీకి అప్పగించనున్నారు. ఇక తాజాగా ప్రారంభించిన “వాగ్‌షీర్” జలాంతర్గామిలో కొన్ని పరికరాలను చేర్చి హర్బరు ప్రయోగాలు చేయనున్నారు. సముద్రంలో ఈ జలాంతర్గామి పనితనం తెలుసుకునేందుకు కొన్ని కఠిన పరీక్షలు నిర్వహించి అన్ని విజయవంతం అయ్యాక నేవీకి అప్పగించనున్నారు.

Also read:Covid-19: ఒక్కరోజే వెయ్యి దాటిన కరోనా కేసులు

ఈ కార్యక్రమంలో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ AB సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ SN ఘోర్మాడే మరియు సమీకృత ప్రధాన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ (నేవీ), హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవీకి చెందిన ప్రముఖులు సహా సీనియర్ నావికా అధికారులు, డైరెక్టర్ జనరల్ డి ఆర్మమెంట్, ఫ్రాన్స్ మరియు నావల్ గ్రూప్, ఫ్రాన్స్ నుండి కమాండర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.

Also read:Warrior Dog : యుక్రెయిన్‌తో రష్యా వార్ లో వారియర్‌గా మారిన కుక్క..వేలమంది ప్రాణాలను కాపాడింది